JBL Wave Buds 2: ప్రయాణాల్లో, వ్యాయామం చేసేటప్పుడు లేదా ఆఫీసు పనుల్లో మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి మంచి వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఉండటం ముఖ్యం. ప్రముఖ ఆడియో బ్రాండ్ జేబీఎల్ తన కస్టమర్ల కోసం సరికొత్త ‘జేబీఎల్ వేవ్ బడ్స్ 2’ (JBL Wave Buds 2)ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ , బెస్ట్ బ్యాటరీ లైఫ్, అదిరిపోయే సౌండ్ క్వాలిటీతో వస్తున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్ ప్రస్తతం మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇయర్ బడ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇయర్‌బడ్స్.. చూడటానికి చాలా స్టైలిష్‌గా , కాంపాక్ట్ డిజైన్‌లో ఉంటాయి. చెవులలో.. సౌకర్యవంతంగా ఇమిడి పోయేలా వీటిని డిజైన్ చేశారు. కనెక్టివిటీ విషయానికి వస్తే..ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ v5.3 టెక్నాలజీని అందించారు. దీని వల్ల ఫోన్ లేదా లాప్‌టాప్‌తో ఇయర్ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. అంతే కాకుండా సిగ్నల్ కట్ అవ్వకుండా స్మూత్ కనెక్షన్ లభిస్తుంది.
బయట రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీసులో.. పనిచేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న సౌండ్స్ మనకు అడ్డంగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఇందులో ..యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను జోడించారు. దీంతో పాటు మొత్తం 4 మైక్రోఫోన్లు ఉండటం వల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు.. అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా, క్లియర్‌గా వినిపిస్తుంది.
ఈ ఇయర్‌బడ్స్ హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్.ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇవి ఏకంగా 40 గంటల పాటు పనిచేస్తాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా వాడొచ్చు.అంతేకా కుండా ఇందులో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. దీని వల్ల కేవలం కొద్ది సేపు ఛార్జ్ చేస్తే గంటల తరబడి మ్యూజిక్ వినొచ్చు.
Also Read: రూ.22,990కే 43 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు
ఈ జేబీఎల్ వేవ్ బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌లో మల్టీ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని సహాయంతో.. ఒకే సమయంలో రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే.. మీ ల్యాప్‌టాప్ , ఫోన్ రెండింటితో దీన్ని ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. టచ్ కంట్రోల్స్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
అన్ని లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ అసలు ధర కేవలం రూ.2,999 మాత్రమే. బడ్జెట్ ధరలో.. బెస్ట్ ఆడియో క్వాలిటీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది మార్కెట్లో ప్రస్తుతం బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు.