E-Paper
Advertisement

థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!

థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!
Advertisement

Best Diesel SUVs: భారత్ లో సుదూర ప్రయాణాలు చేయడానికి చాలామంది SUVలను ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా హైవేలపై ఎక్కువ దూరం ప్రయాణించేవారికి డీజిల్ SUVలు మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పవర్ ఫుల్  ఇంజిన్, హై టార్క్, అదిరిపోయే డ్రైవింగ్ కెపాసిటీ ఆకట్టుకుంటాయి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ, లాంగ్ డ్రైవ్‌లు, అడ్వెంచర్ ట్రిప్‌లు చేసే వారిలో డీజిల్ వాహనాలకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. మీకూ లాంగ్ డ్రైవ్ వెళ్లే డీజిల్ SUVని కొనాలని ఉంటే, ఈ 5 మోడల్స్ ను పరిశీలించండి..

1.మహీంద్రా థార్ రాక్స్

మహీంద్రా థార్ రాక్స్ అడ్వెంచర్ ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో 2.2 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ mHawk ఇంజిన్ ఉంటుంది. ఇది వేరియంట్‌ను బట్టి 150 bhp నుంచి 172 bhp వరకు పవర్, 350 Nm నుంచి 370 Nm వరకు టార్క్‌ ను అందిస్తుంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర రూ.14.23 లక్షలు.

2.టయోటా ఫార్చ్యూనర్

Advertisement

ఈ లిస్టులో బెస్ట్ పవర్‌ ఫుల్ SUV టయోటా ఫార్చ్యూనర్. ఇందులో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 201 bhp పవర్, 500 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 4×2, 4×4 డ్రైవ్ ఆప్షన్లతో పాటు గుంతల రోడ్లపై కూడా స్మూత్ గా వెళ్తుంది. దీని ప్రారంభ ధర రూ.35.75 లక్షలు.

3.ఎంజీ మెజెస్టర్

పెద్ద SUVలను ఇష్టపడేవారికి ఎంజీ మెజెస్టర్ మంచి ఆప్షన్. ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 212.55 bhp పవర్, 478.5 Nm టార్క్‌ ను అందిస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో వచ్చే ఈ SUV, సుదూర ప్రయాణాల్లో మంచి పనితీరును అందించేలా రూపొందించారు. దీని ధర రూ.43.49 లక్షలు.

4.ఫోర్స్ గుర్ఖా

Advertisement

ఆఫ్‌రోడ్ ప్రయాణాలను ఇష్టపడేవారికి ఫోర్స్ గుర్ఖా బాగా నచ్చుతుంది. ఇందులో 2.6 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 138.08 bhp పవర్, 320 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో  లభిస్తుంది. మూడు డోర్లు, ఐదు డోర్ల వెర్షన్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.16.68 లక్షలు.

5.జీప్ మెరిడియన్

కంఫర్ట్‌ తో పాటు మంచి పనితీరు కోరుకునే వారికి జీప్ మెరిడియన్ మరో బెస్ట్ ఆప్షన్. ఇందులో 2.0 లీటర్ మల్టీజెట్ II టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 167.67 bhp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.23.33 లక్షలు.

Read Also: డిసెంబర్‌ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!

Tags

Related News

TVS జుపిటర్ 125 కొత్త వేరియంట్.. త్వరలోనే లాంచ్!

డిసెంబర్‌ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పండుగ సీజన్‌లో భారీ డిమాండ్.. ఏకంగా 61 శాతం పెరిగిన అమ్మకాలు!

JSW కాంబాట్ SUV వచ్చేస్తోంది.. తొలి 500 మందికి అదిరిపోయే స్పెషల్ ఆఫర్!

ఇన్విక్టోలో టయోటా మ్యాజిక్.. ఇక E85 ఫ్లెక్స్ ఫ్యూయల్‌ తో పరుగులు!

మారుతి ఎర్టిగా కొనేవారికి షాక్.. అన్ని వేరియంట్ల ధరలు పెంపు!

నెక్సాన్ To అవినయ ఎక్స్.. టాటా నుంచి రాబోతున్న 5 క్రేజీ కార్లు!

Big Stories

Advertisement
×