E-Paper
Advertisement

రూ.1500 లోపు స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? అయితే Noise ColorFit Pulse Grand పై ఓ లుక్కేయండి!

రూ.1500 లోపు స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? అయితే Noise ColorFit Pulse Grand పై ఓ లుక్కేయండి!
Advertisement

Noise ColorFit Pulse Grand: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌వాచ్ కేవలం సమయం చూసుకోవడానికే కాదు.. ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా, ఆరోగ్యాన్ని కాపాడే గ్యాడ్జెట్‌గా మారిపోయింది. అందుకే మార్కెట్లో రకరకాల ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ ఇండియన్ వేరబుల్ బ్రాండ్ ‘నాయిస్’ తమ కస్టమర్ల కోసం బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ (Noise ColorFit Pulse Grand) స్మార్ట్‌వాచ్‌ను అందిస్తోంది. కేవలం రూ.1,399 ధరకే లభిస్తున్న ఈ వాచ్ స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని పూర్తి స్పెసిఫికేషన్లు, డిజైన్ , వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్ల పూర్తి వివరాలు:

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్:
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్‌వాచ్ డిజైన్ పరంగా చాలా ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. దీని ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ ,స్లిమ్ బాడీ దీనికి ఒక లగ్జరీ అప్పీల్‌ను ఇస్తాయి. తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ కంపెనీ దీని బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

Advertisement

అద్భుతమైన డిజైన్ , డిస్‌ప్లే:
ఇందులో 1.69 ఇంచుల ఎల్‌సీడీ కలర్ టచ్ డిస్‌ప్లేను అందించారు. ఈ పెద్ద స్క్రీన్ , 240×280 పిక్సెల్స్ రిజల్యూషన్ కారణంగా నోటిఫికేషన్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో 150కి పైగా క్లౌడ్-బేస్డ్ , కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. దీని వల్ల యూజర్లు తమ రోజువారీ అవుట్‌ ఫిట్ లేదా మూడ్‌కి తగినట్లుగా వాచ్ ఫేస్‌లను ప్రతిరోజూ మార్చుకోవచ్చు. దీని సిలికాన్ స్ట్రాప్స్ చాలా సాఫ్ట్‌గా ఉండటం వల్ల రోజంతా ఎలాంటి ఇబ్బంది లేదా స్కిన్ అలర్జీలు లేకుండా వాడొచ్చు.

పవర్‌ఫుల్ హెల్త్ ఫీచర్లు:
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారి కోసం ఈ వాచ్‌లో.. ‘నాయిస్ హెల్త్ సూట్’ (Noise Health Suite) అందించారు. ఇందులో ఆక్సిజన్ స్థాయిలను కొలిచే SpO2 మానిటర్, 24×7 హార్ట్ రేట్ ట్రాకర్, స్ట్రెస్ మానిటర్ , స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీ రోజువారీ శారీరక స్థితిని, నిద్ర నాణ్యతను ఖచ్చితంగా పర్యవేక్షించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం కోసం ఇందులో డెడికేటెడ్ ఫీమేల్ హెల్త్/మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్ కూడా ఉంది. ఈ డేటా అంతా కూడా ‘NoiseFit’ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో చెక్ చేసుకోవచ్చు.

Advertisement

క్రీడాకారులు, ఫిట్‌నెస్ లవర్స్ కోసం ఇందులో 60కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ (రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్, యోగా మొదలైనవి) అందుబాటులో ఉన్నాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీని, ఆ సమయంలో బర్న్ అయిన క్యాలరీలను ఇది ఖచ్చితంగా రికార్డ్ చేస్తుంది.

బ్యాటరీ లైఫ్ ,క్విక్ ఛార్జింగ్:
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ బ్యాటరీ బ్యాకప్ పరంగా అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణ వాడకంతో ఇది సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 7 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అంటే పదే పదే ఛార్జింగ్ పెట్టే తలనొప్పి ఉండదు. అంతేకాదు.. ఇందులో ఉన్న ‘ఇన్‌స్టంట్ ఛార్జ్’ ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ స్మార్ట్‌వాచ్ దాదాపు 25 గంటల పాటు నిరంతరాయంగా పని చేస్తుంది. దీని వల్ల అత్యవసర సమయాల్లో ప్రయాణాలకు వెళ్లేటప్పుడు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది.

Also Read: రూ.5వేల బడ్జెట్‌లో ట్రెండ్ అవుతున్న.. లేటెస్ట్ మిక్సీలు!

ఇతర స్మార్ట్ ఫీచర్లు, వాటర్ రెసిస్టెన్స్:
ఈ వాచ్‌లో కేవలం నోటిఫికేషన్లు చూడటమే కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు మరియు కాల్స్‌కు క్విక్ రిప్లై కూడా పంపవచ్చు. ఇంకా అలారం, స్టాప్‌వాచ్, టైమర్, రిమైండర్, లైవ్ వెదర్ అప్‌డేట్స్, కెమెరా కంట్రోల్ , మ్యూజిక్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది IP68 రేటింగ్ తో వస్తుంది. అంటే దుమ్ము, చెమట ,నీటి తుంపరల నుంచి ఈ వాచ్‌కి పూర్తి రక్షణ లభిస్తుంది. కాబట్టి వర్షంలో లేదా జిమ్‌లో వర్కౌట్ చేసే సమయంలో ఎలాంటి భయం లేకుండా దీనిని ఉపయోగించవచ్చు.

ధర :
ఈ అద్భుతమైన ఫీచర్లు ఉన్న నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్‌ వాచ్ భారత మార్కెట్లో ప్రస్తుతం కేవలం రూ.1,399 అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఇది జెట్ బ్లాక్, రోజ్ పింక్, ఆలివ్ గ్రీన్, ఎలక్ట్రిక్ బ్లూ , షాంపేన్ గ్రే వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్లతో పాటు నాయిస్ అధికారిక వెబ్‌సైట్ కొన్ని క్విక్ కామర్స్ యాప్స్‌లో కూడా దీనిని ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరం వారంటీతో వస్తున్న ఈ స్మార్ట్‌వాచ్, తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ గ్యాడ్జెట్ కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్.

Related News

అమ్మబాబోయ్.. మళ్లీ పెరగబోతున్న రీఛార్జ్ ధరలు.. ఏకంగా 15% టారిఫ్ హైక్!

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

Big Stories

Advertisement
×