E-Paper
Advertisement

ఫిట్‌నెస్ బ్యాండ్‌లో ఏఐ వాయిస్ రికార్డింగ్.. Pebble Qore Voxలో ఉన్న టాప్ ఫీచర్లు ఇవే!

ఫిట్‌నెస్ బ్యాండ్‌లో ఏఐ వాయిస్ రికార్డింగ్.. Pebble Qore Voxలో ఉన్న టాప్ ఫీచర్లు ఇవే!
Advertisement

Pebble Qore Vox: స్మార్ట్‌వాచ్‌లలో స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్, వాయిస్ రికార్డింగ్ వంటి ఫీచర్లు కావాలనుకునే వారి కోసం ప్రముఖ పెబుల్ కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌ను తీసుకొచ్చింది. Pebble Qore Vox పేరుతో వచ్చిన ఈ కొత్త డివైజ్‌లో AI ఆధారిత వాయిస్ రికార్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మీటింగ్స్, క్లాసులు, ముఖ్యమైన సంభాషణలను రికార్డ్ చేయడంతో పాటు వాటిని టెక్స్ట్‌గా మార్చి, సారాంశాన్ని కూడా అందిస్తుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Qore, Qore 2 మోడళ్లకు ఇది కొనసాగింపుగా వచ్చింది.

ధర, కలర్ ఆప్షన్లు:

Pebble Qore Vox అసలు ధర రూ.9,999గా ఉంది. అయితే ప్రస్తుతం లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.5,799కే అందిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. స్టెల్త్ బ్లాక్, స్టార్మ్ బ్లూ, సమ్మిట్ బ్రౌన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తోంది.

Advertisement

Also Read: జీమెయిల్, ఫొటోస్, యూట్యూబ్ ఆధారంగా రోజూ కొత్త కథలు.. Dreambeans ఏఐ యాప్ ఎలా పనిచేస్తుందంటే?

AI వాయిస్ రికార్డింగ్:

ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో పక్కన ఉన్న ఫిజికల్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే వాయిస్ రికార్డింగ్ మొదలవుతుంది. మీటింగ్స్, లెక్చర్లు, సంభాషణలు, వ్యక్తిగత రిమైండర్లను రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత Pebble Vox యాప్ ద్వారా వాటిని టెక్స్ట్‌గా మార్చుకోవడంతో పాటు ఏఐ సారాంశాన్ని కూడా పొందవచ్చు. ఇందులో హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ భాషలకు సపోర్ట్ ఉంది. ఇంగ్లీష్‌తో పాటు మరో 24 విదేశీ భాషల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంది. రికార్డింగ్స్‌ను వాట్సప్ లేదా ఈమెయిల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.

స్టోరేజ్, హెల్త్ ట్రాకింగ్:

Advertisement

ఫోన్ దగ్గర లేకపోయినా.. 100 నిమిషాల వరకు రికార్డింగ్స్‌ను డివైజ్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. కనెక్షన్ తిరిగి వచ్చినప్పుడు యాప్‌లోకి సింక్ అవుతాయి. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు బ్లూ లైట్ వెలుగుతుంది. ట్రాన్స్‌క్రిప్షన్, AI సారాంశాలకు అదనపు సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.

బ్యాటరీ, ఇతర ఫీచర్లు:

ఇందులో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. హార్ట్ రేట్, HRV, నిద్ర, బ్లడ్ ఆక్సిజన్, ఒత్తిడి, స్టెప్స్, క్యాలరీలను ట్రాక్ చేస్తుంది. ఫోన్‌తో జత చేసినప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ కూడా పనిచేస్తుంది. రికవరీ స్కోర్, డైలీ ఏఐ హెల్త్ రిపోర్ట్ అందిస్తుంది. దీని బరువు సుమారు 53 గ్రాములు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది. మొత్తంగా వాయిస్ రికార్డింగ్, హెల్త్ ట్రాకింగ్ రెండూ ఒకే డివైజ్‌లో కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Also Read: ఇంతకాలం ఈ విషయం తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో.. ఫోన్ ఛార్జర్‌తోనే ట్రిమ్మర్‌కు ఛార్జింగ్!

Tags

Related News

వాట్సప్‌లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్.. కాల్ చేయాలన్నా, అడ్రస్ చూడాలన్నా ఇక చాట్‌లోనే!

రూ. 279 రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే పండగ.. 20కి పైగా ఓటీటీలు ఉచితం!

జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. రూ.111 రీఛార్జ్‌తో గేమింగ్, ఓటీటీ, స్నాప్‌చాట్+ ఫ్రీ!

జీమెయిల్, ఫొటోస్, యూట్యూబ్ ఆధారంగా రోజూ కొత్త కథలు.. Dreambeans ఏఐ యాప్ ఎలా పనిచేస్తుందంటే?

పిల్లి చేసే ఆ శబ్దం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా?

రూ.1,599కే..20000 mAh భారీ బ్యాటరీతో ఫిలిప్స్ పవర్ బ్యాంక్!

డాల్బీ అట్మాస్,4K క్లారిటీతో..సోనీ బ్రావియా 2 విడుదల!

Big Stories

Advertisement
×