E-Paper
Advertisement

రూ. 279 రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే పండగ.. 20కి పైగా ఓటీటీలు ఉచితం!

రూ. 279 రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే పండగ.. 20కి పైగా ఓటీటీలు ఉచితం!
Advertisement

Airtel Rs 279 Plan: టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తెచ్చిన రూ.279 ప్లాన్ తనదైన ప్రత్యేకతలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్లతో యూజర్లను తనవైపు తిప్పుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, లైవ్ స్పోర్ట్స్ చూసే వారికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుందని ఎయిర్ టెల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.279 ప్లాన్ కు సంబంధించి విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.

30 జీబీ డేటా.. ఎప్పుడైనా మీ ఇష్టం!

రూ. 279 ప్లాన్‌ను నెల రోజుల వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 30 జీబీ హై-స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేస్తోంది. సాధారణ ప్లాన్లలో ఇచ్చినట్లుగా రోజుకి 1 జీబీ, 2 జీబీ అనే పరిమితి లేకుండా.. మొత్తం 30 జీబీ డేటాను ప్లాన్ వ్యవధిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. మొబైల్‌లో వీడియోగేమ్‌లు ఆడటానికి, సోషల్ మీడియాలో రీల్స్ చూడటానికి ఈ డేటా బాగా ఉపయోగపడనుంది. ఒకవేళ 30 జీబీ డేటా పరిమితి పూర్తయితే ఆ తర్వాత వాడే ఇంటర్నెట్‌కు 1 ఎంబీ (MB)కి 50 పైసల చొప్పున అదనపు ఛార్జీ విధించనున్నారు.

ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు!

Advertisement

ఈ ప్లాన్‌కు ప్రధాన ఆకర్షణగా ఉచిత ఓటీటీలు నిలుస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, జీ5 ప్రీమియం ఫ్రీ సబ్ స్క్రిప్షన్లను ఈ ప్లాన్ కింద ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే (Airtel Xstream Play) ప్రీమియం ద్వారా సోనీలివ్ (SonyLIV)తో సహా దాదాపు 18కి పైగా ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఉచితంగా వీక్షించే వెసులుబాటును కల్పిస్తోంది. కాబట్టి తక్కువ బడ్జెట్ లో ప్రముఖ ఓటీటీలు అన్నింటిని వీక్షించాలని భావించే వారికి ఈ ప్లాన్ మెగురైన ఆప్షన్ గా నిలుస్తుందని ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. రూ.111 రీఛార్జ్‌తో గేమింగ్, ఓటీటీ, స్నాప్‌చాట్+ ఫ్రీ!

ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

Advertisement

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్, జీ5, జియోహాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లకు ఇచ్చే మంత్లీ సబ్‌స్క్రిప్షన్లను నిర్ణీత సమయం లోపే ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ప్లాన్ వ్యాలిడిటీతో పాటే ఈ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ల గడువు కూడా ముగిసిపోతుందని తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ ప్లాన్‌లో ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు సదుపాయం ఉండదని ఎయిర్ టెల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం డేటా, ఓటీటీ సేవలను ఉద్దేశించి మాత్రమే ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: హ్యుందాయ్ నవంబర్ ఆఫర్లు వచ్చేశాయ్.. క్రెటాపై ఏకంగా రూ.1.20 లక్షల డిస్కౌంట్!

Tags

Related News

వాట్సప్‌లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్.. కాల్ చేయాలన్నా, అడ్రస్ చూడాలన్నా ఇక చాట్‌లోనే!

ఫిట్‌నెస్ బ్యాండ్‌లో ఏఐ వాయిస్ రికార్డింగ్.. Pebble Qore Voxలో ఉన్న టాప్ ఫీచర్లు ఇవే!

జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. రూ.111 రీఛార్జ్‌తో గేమింగ్, ఓటీటీ, స్నాప్‌చాట్+ ఫ్రీ!

జీమెయిల్, ఫొటోస్, యూట్యూబ్ ఆధారంగా రోజూ కొత్త కథలు.. Dreambeans ఏఐ యాప్ ఎలా పనిచేస్తుందంటే?

పిల్లి చేసే ఆ శబ్దం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా?

రూ.1,599కే..20000 mAh భారీ బ్యాటరీతో ఫిలిప్స్ పవర్ బ్యాంక్!

డాల్బీ అట్మాస్,4K క్లారిటీతో..సోనీ బ్రావియా 2 విడుదల!

Big Stories

Advertisement
×