E-Paper

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!
Advertisement

ఇప్ప‌టికే భ‌గ్గుమంటున్నారు క‌విత మీద‌.. కేటీఆర్ టీం! కేటీఆర్ టీం అంటేనే ఆయ‌న పెంచి పోషిస్తున్న సోష‌ల్ మీడియా అన్న‌మాట‌. సిరిసిల్ల కేంద్రంగా ఆమె కేటీఆర్‌పై  చేసిన దాడితో భ‌గ్గుమంటున్నారంతా! మ‌రి నెల‌కు ప‌ది కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడాయె కేటీఆర్‌! నిన్న‌టి దాకా కొంత ఓపిక ప‌ట్టారు. కానీ ఇక ఆగ‌లేక‌పోతున్నారంతా.

ఎందుకంటే కేటీఆర్‌కు ఆయువుప‌ట్టైన‌.. సిరిసిల్ల‌కు వెళ్లి మ‌రీ తుక్కు తుక్కుగా తిట్టారు క‌విత‌. వీకెండ్ హాలీడేలా.. వీకెండ్‌కు వ‌చ్చిపోయే ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి త‌రువాత ముఖ్య‌మంత్రివి నీవేనైతివి… మ‌రి నువ్వు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల‌కు ఏం చేశావో చెప్పు అని ఆమె సూటిగా, ఘాటుగా వేసిన ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్‌, అండ్ టీమ్‌.. గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డ‌టైంది.

Advertisement

ఇది వారు క‌నీసం ఊహించ‌లేదు. ఇది ఒక ప్రారంభం మాత్ర‌మే.. ఇక ఆమె మ‌రింత దూకుడుగా కేటీఆర్‌పై దాడిని కొన‌సాగించ‌నున్నార‌ని వారికి అర్థ‌మైంది. దీంతో త‌మ‌లో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న క‌సి, క‌క్ష అంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌కు తేవ‌డానికి క‌త్తులు నూరుతున్న‌ట్టు తెలుస్తోంది. త‌ల్లీ, చెల్లీ అనే సెంటిమెంట్ తెలియ‌ని సిల్లీనా కొడుకును.. అనే మోహ‌న్‌బాబు ఫేమ‌స్ డైలాగ్‌లా.. ఇప్పుడు కేటీఆర్ అండ్ టీమ్‌.. మ‌రింత రెచ్చిపోవడానికి రెడీ అయ్యారు.

ఇప్ప‌టికే ఓ వైపు హ‌రీశ్, అండ్ సోష‌ల్ మీడియా టీమ్‌.. క‌విత‌ను వెంటాడుతోంది. దీనికి పోటీగా కేటీఆర్ టీమ్ కూడా వ‌ద‌ల‌డం లేదు. కానీ ఇప్పుడు వారికి ప‌ట్ట‌ప‌గ్గాల్లేకుండా పోయాయి. కేటీఆర్ కూడా వారిని వారించే ప‌రిస్థితుల్లో లేడు. ఎందుకంటే క‌విత సిరిసిల్ల ప్రోగ్రాం చూసిన త‌రువాత ఆమె భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతుందో కేసీఆర్‌, కేటీఆర్ తో పాటు.. హ‌రీశ్‌రావు కూడా అర్థ‌మైపోయింది. ఇక దాడే ముమ్మ‌రం చేయాల్సి ఉంద‌నే విష‌యం వారికి అవ‌గ‌త‌మైంది. అందుకే ఇక దాడికి కావ‌ల్సిన క‌స‌రత్తులు చేస్తున్నారు.

Advertisement

క‌విత‌.. ఇక త‌న టార్గెట్ కేటీఆర్ అనే విధంగా మాట్లాడారు సిరిసిల్ల‌లో. వారికి అర్థ‌మైపోయింది.. ఇక ఆమె త‌న దాడి ముమ్మ‌రం చేయ‌నున్నార‌ని. అందుకే తాము కూడా అస్త్రాల‌ను సంధించే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే క‌విత‌.. కేటీఆర్ సోష‌ల్ మీడియా టీంపైనా త‌న‌దైన స్టైల్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. కుక్క తోక‌ను ఆడించాలి గానీ.. తోక కుక్క‌ను ఆడించొద్ద‌ని అన్నారు. అంటే.. కేటీఆర్ పెంచి పోషిస్తున్న ఆ పార్టీ సోష‌ల్ మీడియా టీం.. కేటీఆర్‌నే ఆడించే స్థాయికి చేరుకున్న‌ది.

అంటే కేటీఆర్ అది చెప్పిన‌ట్టే వింటున్నాడు.. నేల విడిచి సాము చేస్తున్నాడ‌నేది ఆమె భావ‌న‌. సేమ్ అలాగే జ‌రుగుతున్న‌ది ఆ పార్టీలో. క్షేత్ర‌స్థాయిలో ఉద్య‌మాలు నిర్మించే ప‌నిని వ‌దులుకున్నాడు కేటీఆర్‌. ఓన్లీ మీటింగులు, ప్రెస్‌మీట్లు, చిట్‌చాట్‌లు.. సోష‌ల్ మీడియా ట్రోలింగులు.. ట్విట్ట‌ర్ పిట్ట గూటిలో గుడ్లు పెట్ట‌డాలు! ఇవే ఇప్పుడు కేటీఆర్ ఉద్య‌మ రూపాలు. అందుకే క‌విత అత‌న్ని పొల్లు పొల్లు తిడుతున్నారు. దీనికి జ‌నం నుంచి కూడా మంచి స్పంద‌నే ల‌భిస్తున్న‌ది. క‌విత‌కు ఆద‌ర‌ణ దొరుకుతున్న‌ది.

Related News

జెన్‌-జీ మెచ్చిన నేత రాహుల్‌! మ‌రి మోడీపై ఎందుకా వ్య‌తిరేక‌త‌!?

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

దేశం కోసం.. దేశ స‌మైక్య‌త కోసం.. దేశ ద్రోహం..! ఎవ‌రి వాద‌న రైటు..! ఎవ‌రు క‌రెక్టు..?

వ‌రి విచ్చ‌ల‌విడిగా వేసుకోండి..! బీఆరెస్ స్టాండ్ ఏమిటీ? రైతుల‌ను రెచ్చ‌గొట్టేందుకేనా?

పండుగ‌లా రైతుభ‌రోసా.. బ‌హిరంగ స‌భ పెట్టిమ‌రీ నిధుల‌ విడుద‌ల!

కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. మార్పు తెచ్చి చూపిస్తా! రేవంత్ మార్క్ మార్పైతే కాద‌ట‌!

Big Stories

×