Nokia X200 5G: నోకియా అనే పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది నమ్మకం, స్ట్రాంగ్ బిల్డ్, దీర్ఘకాలం ఉపయోగపడే ఫోన్. ఒకప్పుడు భారత మార్కెట్‌ను ఏలిన నోకియా, స్మార్ట్‌ఫోన్ యుగంలో ఇప్పుడు మళ్లీ క్రమంగా బలమైన రీఎంట్రీ ఇస్తోంది. ముఖ్యంగా 5జి సెగ్మెంట్‌లో నోకియా తన పాత గుర్తింపును తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త మోడల్స్‌ను ప్లాన్ చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే త్వరలో భారత్‌కు రానున్న ఫోన్ నోకియా ఎక్స్200 5జి. ఈ ఫోన్ ద్వారా మిడ్ రేంజ్ మార్కెట్‌లో గట్టిగా నిలబడాలని నోకియా చూస్తోంది. డిజైన్, డిస్‌ప్లే, పనితీరు,బ్యాటరీ సామర్థ్యం వంటి అంశాలలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నోకియా.. ఇప్పుడు మార్కెట్‌లోకి తక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడమే కాకుండా, దాన్ని మరింత సులభమైన ఈఎంఐ ఆఫర్లతో అందిస్తోంది. ఆ ఫోన్ పూర్తి వివరాలు, ఆఫర్ల గురించి ఇప్పుడే తెలుసుకుందాం.
ధరలో పోటీకి సిద్ధమైన నోకియా ఎక్స్ 200 5జి
ఇప్పుడు నోకియా ఎక్స్ 200 5జి విషయానికి వస్తే, ఈ ఫోన్ ధర భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా పోటీగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. లభిస్తున్న వివరాల ప్రకారం ఈ ఫోన్‌ను రూ.14,999 నుంచి రూ.15,999 మధ్య ధరలో లాంచ్ చేయనున్నారు. ఈ ధర రేంజ్‌లో నోకియా బ్రాండ్ ఫోన్ రావడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే చాలా 5జి ఫోన్స్ ఉన్నా, నోకియా ఇచ్చే బిల్డ్ క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ స్టేబిలిటీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదే నమ్మకాన్ని ఎక్స్200 5జిలో కూడా కొనసాగిస్తారని అంచనాలు ఉన్నాయి.
Also Read: Samsung 2026 Flagship: ఫోటోగ్రఫీ లిమిట్స్ బ్రేక్ చేసిన శామ్‌సంగ్ 2026 ఫ్లాగ్‌షిప్.. లాంచ్ ఎప్పుడంటే?
ఈఎంఐలతో మరింత అందుబాటు
ధరతో పాటు ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఈ ఫోన్‌ను ఇంకా అందుబాటులోకి తీసుకువస్తాయి. నోకియా ఎక్స్200 5జిపై నెలకు రూ.1,400 నుంచి రూ.1,600 మధ్య ఈఎంఐలు ఉండే అవకాశం ఉందని సమాచారం. మధ్య తరగతి వినియోగదారులకు దృష్టిలో పెట్టుకుని, అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండా, చిన్న ఈఎంఐలతోనే 5జి ఫోన్ కొనుగోలు చేసే ఛాన్స్ యూజర్స్‌కి లభిస్తుంది. స్టూడెంట్స్, ఉద్యోగులు, ఫస్ట్ టైమ్ 5జి యూజర్స్‌కు ఇది చాలా ఉపయోగపడే అంశం.
లాంచ్ ఆఫర్లు.. కొనుగోలు విలువ పెంచేలా ప్లాన్
లాంచ్ టైమ్‌లో నోకియా ప్రత్యేక ఆఫర్లను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొనుగోలు చేసే వారికి ఎక్స్చేంజ్ బోనస్ ఇవ్వవచ్చని చెబుతున్నారు. దీనివల్ల ఫైనల్ ధర ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్ కూడా లాంచ్ సమయంలో అందుబాటులోకి రావచ్చు. ఇవన్నీ కలిపి చూస్తే నోకియా ఎక్స్ 200 5జి డబ్బుకు తగిన విలువైన ఫోన్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే
ఇక ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే ప్రశ్నకు వస్తే, ఇప్పటివరకు వచ్చిన లీక్‌ల ప్రకారం నోకియా ఎక్స్200 5జిను 2025 సంవత్సరంలో డిసెంబర్ లాస్ట్‌లో తేదా 2026 జనవరి నుంచి మార్చి మధ్యలో భారత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అధికారిక లాంచ్ తేదీపై ఇంకా స్పష్టత లేకపోయినా, లాంచ్ మాత్రం దగ్గరలోనే ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద నోకియా ఎక్స్200 5జి నోకియా అభిమానులతో పాటు కొత్త యూజర్స్‌ను కూడా ఆకట్టుకునేలా సిద్ధమవుతోంది.