E-Paper
Advertisement

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!
Advertisement

Jio Freedom Day Offer: రిలయన్స్ జియో తమ వినియోగదారులకు స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా అదిరిపోయే వార్త తెలిపింది. లాంగ్ టర్మ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై రూ. 6,000 వరకు భారీ డిస్కౌంట్‌ను ప్రకటిస్తూ ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ ద్వారా రూ.1000 కి పైగా విలువైన 100Mbps ప్లాన్ ధర నెలకు రూ. 666 కే లభించనుంది.

మైజియో యాప్‌లో మాత్రమే..!

ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రస్తుతానికి మైజియో (MyJio) యాప్‌లో మాత్రమే ప్రత్యక్షమైంది. ఇంకా జియో అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అప్‌డేట్ కాలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఆఫర్‌కు ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవు. జియో యూజర్లు అందరూ దీనిని పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను దశలవారీగా విడుదల చేస్తుండటంతో, కొంతమంది వినియోగదారులకు యాప్‌లో కనిపించడానికి కాస్త సమయం పట్టే ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రూ. 1,066 నుంచి రూ. 666 తగ్గింపు

Advertisement

నిజానికి ‘ఫ్రీడమ్ డే ప్యాక్’ పేరుతో జియో అందిస్తున్న ఈ 15 నెలల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అసలు ధర రూ. 16,000గా ఉండేది. కానీ ఈ పరిమిత కాల ఆఫర్ కింద రూ.6,000 ప్లాట్ డిస్కౌంట్ ఇస్తుండటంతో, ఇప్పుడు దీనిని రూ. 10,000 కే పొందే వెసులుబాటు లభించింది. ఫలితంగా నెలకు రూ. 1,066 చొప్పున ఖర్చయ్యే ఈ ప్లాన్.. డిస్కౌంట్ దెబ్బకు ఇప్పుడు నెలకు దాదాపు రూ. 666 పడుతోంది.

ప్లాన్ బెనిఫిట్స్ ఇవే!

ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 100Mbps వేగంతో అపరిమిత డేటా లభించనుంది. దీనికి తోడు 1,000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లు, 12కి పైగా ఓటీటీ (OTT) యాప్‌ల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్లు యూజర్లకు లభించనుంది. మైజియో యాప్ వివరాల ప్రకారం.. ఈ ప్యాకేజీలో జియో హాట్‌స్టార్, సోనీలివ్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఉచితంగా పొందొచ్చు. గత కొన్నేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జియో ఇలాంటి ఆఫర్లనే ఇస్తుండగా.. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీ కొనసాగించినట్లైందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

కొత్తగా హోమ్ ప్యాక్స్ ప్రకటన

ఇదిలా ఉంటే స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌కు ముందే జియో తన ‘హోమ్ ప్యాక్స్’ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. బ్రాడ్‌బ్యాండ్, టీవీ, ఓటీటీ సేవలను విడివిడిగా, ఆల్ ఇన్ వన్ గా అందించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం లైవ్ టీవీ ఛానెల్స్ (1000+) కావాలనుకుంటే రూ.400.. ఇంటర్నెట్ చాలు అనుకుంటే 30Mbps ప్లాన్ నెలకు రూ. 450, 100Mbps ప్లాన్ నెలకు రూ. 600 చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చింది. వైఫై, టీవీ, ఓటీటీలు అన్నీ కోరుకుంటే 30Mbps ప్లాన్ నెలకు రూ. 555, 100Mbps ప్లాన్ నెలకు రూ. 707గా జియో నిర్ణయించింది.

Also Read: పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Karthika Deepam 2 Serial Today Episode September 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో దీప – ఇంట్లోంచి గెంటివేయబడ్డ శివనారాయణ          

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Big Stories

Advertisement
×