Flipkart Freedom Sale 2026: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రొడక్టులకు భారతదేశంలో ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేము. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో ఐఫోన్ కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ ఒక శుభవార్త మోసుకొచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ‘ఫ్రీడమ్ సేల్ 2026’ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో కొత్త ఐఫోన్ మోడళ్లపై భారీ తగ్గింపులు, బ్యాంక్ డిస్కౌంట్లు లభించనున్నాయి.
ఈ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8 నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు మాత్రం ఒక రోజు ముందుగానే, అంటే ఆగస్టు 7 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో యాపిల్ లేటెస్ట్ iPhone 17 సిరీస్‌తో పాటు పాత మోడళ్లపై కూడా అద్భుతమైన డీల్స్ అందించనున్నారు.
లాంచ్ సమయంలో రూ.1,34,900 ఉన్న iPhone 17 Pro మోడల్, సేల్‌లో నేరుగా రూ.8,000 తగ్గింపుతో రూ.1,26,900కి లభించనుంది. దీనికి తోడు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడేవారికి అదనంగా రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ దక్కుతుంది. ఈఎంఐ ఆప్షన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ ధర దాదాపు రూ.1,17,900కే లభించే అవకాశం ఉంది.
Also Read: 90 డిగ్రీల రొటేషన్, కోడింగ్‌కు పర్ఫెక్ట్.. డెవలపర్ల కోసం బెన్ క్యూ సూపర్ మానిటర్ లాంచ్!
అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 ప్రో మాక్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ రూ.8,000 తగ్గించింది. దీంతో రూ.1,49,900 ధర కలిగిన ఈ ఫోన్ రూ.1,41,900కి అందుబాటులోకి వస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ కలిపితే దీని ఎఫెక్టివ్ ధర రూ.1,32,900 వరకు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా.. స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ రూ.80,000 కంటే తక్కువ ధరకే లభించవచ్చని భావిస్తున్నారు.
మంచి కెమెరా, స్ట్రాంగ్ బాడీ కలిగిన ఐఫోన్ 15 కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఇది సరైన సమయం. ఈ ఫోన్ సేల్‌లో రూ.58,900 ప్రారంభ ధర వద్ద లభించనుంది. అంతేకాకుండా.. నెలకు రూ.4,909 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అయితే ఈ తగ్గింపులన్నీ బ్యాంక్ ఆఫర్లు, కార్డ్ రకాలను బట్టి మారుతుంటాయని గమనించాలి.
Also Read: WhatsApp యూజర్లకు బిగ్ రిలీఫ్.. స్టేటస్ క్యాప్షన్‌లో తప్పు పడిందా? ఇక డిలీట్ చేయక్కర్లేదు!