E-Paper
Advertisement

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?
Advertisement

India EV Sales July 2026: భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్ మార్కెట్ జూలై 2026లో కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా ఒకే నెలలో 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు అమ్ముడయ్యాయి.  జూలైలో మొత్తం 2,04,266 ఎలక్ట్రిక్ టూ వీలర్లు రిటైల్ అమ్మకాలు రికార్డు అయ్యాయి. మార్చి 2026లో నమోదైన ఈవీ స్కూటర్ల రికార్డు ఈ నెల బ్రేక్ అయ్యింది.  ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు మొత్తం 11.7 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 56 శాతం ఎక్కువ. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే 7.29 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడు కావడంతో, EV మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నట్లు అర్థం అవుతోంది.

టాప్ ప్లేస్ దక్కించుకున్న టీవీఎస్

జూలైలో TVS మోటార్ అత్యధిక అమ్మకాలతో టాప్ ప్లేస్ లో నిలిచింది. కంపెనీ 55,477 iQube ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మి  చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే TVS అమ్మకాలు 135 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 27 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం iQubeతో పాటు కంపెనీ ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లకు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది.

రెండు, మూడు స్థానాల్లో బజాజ్, ఏథర్

Advertisement

రెండో స్థానంలో బజాజ్ ఆటో నిలిచింది. కంపెనీ జూలైలో 45,592 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 122 శాతం వృద్ధిని సాధించింది. కొత్తగా విడుదలైన చేతక్ 2501 మోడల్‌ కు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.  మూడో స్థానంలో ఏథర్ ఎనర్జీ ఉంది. ఈ కంపెనీ జూలైలో 30,323 యూనిట్లు విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 70 శాతం వృద్ధిని సాధించింది. ఇటీవల 450, రిజ్టా మోడళ్లలో బ్యాటరీ అప్‌డేట్లు చేసిన ఏథర్, ఈ నెల చివర్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

మార్కెట్ లో విడా దూకుడు

హీరో మోటో కార్ప్‌ కు చెందిన విడా కూడా జూలైలో కొత్త రికార్డు నమోదు చేసింది. కంపెనీ 22,887 యూనిట్లు అమ్మి,  ఇప్పటి వరకు అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 111 శాతం వృద్ధి సాధించడం విశేషం. ఇటీవల విడుదల చేసిన కొత్త VX2 సిరీస్ మోడళ్లు విడా అమ్మకాల పెరుగుదలకు మంచి బూస్టింగ్ లభించింది.

ఓలా మరింత వెనక్కి!

Advertisement

ఒకప్పుడు మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మాత్రం ఈసారి వెనుకబడింది. జూలైలో కంపెనీ 14,105 యూనిట్లు మాత్రమే అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే 24 శాతం తగ్గుదల కనబరిచింది.. దీంతో ఓలా మార్కెట్ వాటా 17 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది.

Read Also: వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

Tags

Related News

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

ఈ హెల్మెట్లు పెట్టుకుంటే.. జుట్లు రాలే సమస్యలే ఉండవట, వెంటనే కొనేయండి!

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

Big Stories

Advertisement
×