E-Paper
Advertisement

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే ముప్పుతిప్పలు పెడుతున్న ‘వొయ్నిచ్’ మిస్టరీ!

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే ముప్పుతిప్పలు పెడుతున్న ‘వొయ్నిచ్’ మిస్టరీ!
Advertisement

Voynich Manuscript: ప్రపంచంలో ఎన్నో ఏళ్లుగా ఛేదించలేని మిస్టరీలు చాలానే ఉన్నాయి. కానీ ఒక పుస్తకం మాత్రం వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులను, భాషా నిపుణులను, సంకేత భాషా శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలను తలపట్టుకునేలా చేస్తోంది. అదే ‘వొయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్’ (Voynich Manuscript). ఇందులో అక్షరాలు ఉన్నాయి కానీ చదవలేం.. బొమ్మలు ఉన్నాయి కానీ అవేంటో అర్థం కావు. 16వ శతాబ్దం నాటి ఈ వింత పుస్తకం ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చదవలేని ఏకైక గ్రంథంగా మిగిలిపోయింది. మానవ మేధస్సుకు పెద్ద సవాలుగా మారిన ఈ పుస్తకం కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

అసలు ఏముందా పుస్తకంలో?

ఈ వింత పుస్తకంలో విచిత్రమైన మొక్కల చిత్రాలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన చక్రాలు, వింత ఆకారంలో ఉన్న స్త్రీల బొమ్మలు కనిపస్తాయి. మన భూమి మీద ఎక్కడా కనిపించని రాక్షస పరిమాణంలో ఉన్న పూలు, వేర్లు, రంగురంగుల ద్రవాలు ఉన్న కుండలు అందులో ఉన్నాయి. దాదాపు 240 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ ఎవరికీ అర్థం కాని ఊహాజనిత ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ఈ చిత్రాలు చూస్తుంటే.. ఇదొక మూలికా వైద్య గ్రంథమా లేక ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకమా అనే సందేహం కలుగుతుంది.

భయపెడుతున్న ఆ వింత కోడ్:

Advertisement

ఈ పుస్తకంలోని అక్షరాలు, సంకేతాలు ప్రపంచంలోని ఏ భాషకూ సరిపోలవు. దీనిని ఒక ప్రత్యేకమైన సీక్రెట్ కోడ్ లేదా అంతరించిపోయిన రహస్య భాష అని భావిస్తున్నారు. ఈ కోడ్ చదవడానికి ప్రయత్నించిన ఎంతోమంది శాస్త్రవేత్తలు మానసికంగా అలసిపోయారు. కొన్ని అక్షరాలు లాటిన్ లేదా గ్రీకు భాషలను పోలి ఉన్నప్పటికీ.. వాటి కలయిక మాత్రం ఏ వ్యాకరణ నియమాలకు అందడం లేదు. ఇప్పటికీ అందులోని పదాలు ఏ అర్థాన్ని ఇస్తున్నాయో ఎవరూ కనిపెట్టలేకపోయారు.

Also Read: భోగాపురమే కాదు, ఇండియాలోని ఈ ఎయిర్‌పోర్టులూ సిటీకి దూరమే.. ఎంత టైమ్ పడుతుందంటే?

సైన్స్‌కే సవాలు విసురుతున్న విచిత్రం:

Advertisement

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో శత్రుదేశాల సంకేతాలను సైతం చాలా సులభంగా ఛేదించిన ప్రపంచ ప్రసిద్ధ క్రిప్టోగ్రాఫర్లు కూడా ఈ పుస్తకంలో ఏముందో పట్టుకోలేకపోయారు. అంతేకాదు.. నేటి ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సూపర్ ‌కంప్ల్యూటర్ల సహాయంతో ఈ కోడ్ ఛేదించడానికి ప్రయత్నించినప్పటికీ సరైన ఫలితం దక్కలేదు. కార్బన్ డేటింగ్ పరీక్షల ప్రకారం ఈ పుస్తకం 15వ శతాబ్దం ప్రారంభంలో అంటే 1404 నుండి 1438 మధ్యకాలంలో తయారు చేసిన తోలు కాగితాలపై రాసినట్లు తేలింది.

అనేక అనుమానాలు, సిద్ధాంతాలు:

ఈ పుస్తకం గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. కొందరు ఇది కేవలం ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికి రాసిన ఒక నకిలీ పుస్తకం అని కొట్టిపారేశారు. మరికొందరు మాత్రం అప్పట్లో నిషేధానికి గురైన రహస్య వైద్య విధానాలు లేదా మంత్ర తంత్రాల సమాచారాన్ని దాచడానికి ఈ కోడ్ వాడారని నమ్ముతున్నారు. అంతేకాదు.. భూమిపై లేని గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఇందులో ఉందనే విచిత్రమైన ప్రచారాలు కూడా లేకపోలేదు.

ఎటూ తేల్చని రహస్యంగా మిగిలిన చరిత్ర:

పోలాండ్‌కు చెందిన పుస్తకాల వ్యాపారి విల్ఫ్రిడ్ వొయ్నిచ్ 1912లో ఈ పుస్తకాన్ని కనుగొనడంతో దీనికి ఆయన పేరే పెట్టారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన బీనెకే లైబ్రరీలో ఈ పుస్తకాన్ని అత్యంత భద్రంగా ఉంచారు. ఎన్ని పరిశోధనలు జరిగినా.. ఎంతమంది మేధావులు శ్రమించినా ఈ పుస్తకం తన రహస్యాన్ని మాత్రం వీడటం లేదు. శాస్త్ర సాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందినా, సమాధానం దొరకని అతిపెద్ద మిస్టరీగా ఈ వొయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్ చరిత్రలో నిలిచిపోనుంది.

Also Read: మనిషి కంటే ఎత్తు.. 15 ఏళ్లకు ఒక్కసారే పూచే ‘హిమాలయన్ డైమండ్’ విశేషాలివే!

 

Tags

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×