E-Paper
Advertisement

పరిశుభ్రతలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఏకంగా ఏడు నగరాలకు అత్యుత్తమ పురస్కారాలు

పరిశుభ్రతలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఏకంగా ఏడు నగరాలకు అత్యుత్తమ పురస్కారాలు
Advertisement

దేశవ్యాప్తంగా పరిశుభ్రతను పాటించే నగరాలు, పట్టణాలను గుర్తించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు. 2025-2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ పురస్కారాల్లో ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తా చాటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలు జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు వివిధ విభాగాల్లో బెస్ట్ అనిపించుకున్నాయి. ఇక తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరానికి కూడా జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది..

నెంబర్ వన్‌గా విశాఖపట్నం, మూడో స్థానంలో విజయవాడ

పరిశుభ్రతకు పెద్ద పీట వేసే నగరాల్లో విశాఖపట్నం ఒకటి. అందుకే, ఏటా క్రమం తప్పకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానాల్లో కొనసాగుతోంది. 2025-2026కు గాను.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. 10 లక్షలకు పైగా జనాభా కలిగి నగరాల విభాగంలో దేశంలోనే తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. సూపర్ స్వచ్ఛ్ లీగ్‌లో విజయవాడ మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మహారాష్ట్రకు చెందిన నవీ ముంబై మొదటి స్థానంలో, గుజరాత్‌లోని సూరత్ నగరం రెండో స్థానంలో నిలిచాయి. గుంటూరు నగరం కూడా ఈ సారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించింది. 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో గుంటూరు మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

కుప్పం, తిరుపతి నగరాలకు అరుదైన గుర్తింపు

Advertisement

ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ‘స్వచ్ఛ షెహర్ జోడీ’ని ప్రవేశపెట్టారు. పరిశుభ్రతలో మెరుగైన పనితీరు కనబరిచిన నగరాలు, పట్టణాలను గుర్తిస్తూ ఈ పురస్కారాలు అందించారు. ఇందులో తిరుపతి-కుప్పం సంయుక్తంగా జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలిచి అవార్డులను దక్కించుకున్నాయి. అహ్మదాబాద్-సనంద్ జోడీ మొదటి స్థానంలో నిలవగా, ఇండోర్-దేపాల్‌పూర్ రెండో స్థానంలో నిలిచాయి. అలాగే రాజమండ్రికి కూడా ఈ సారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్రంలోనే అత్యుత్తుమె పరిశుభ్ర నగరంగా ‘స్టేట్ ఫస్ట్ స్వచ్ఛ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అవార్డును దక్కించుకుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆరు జాతీయ పురస్కారాలు అందుకుంది. గతేడాది ఏపీకి ఐదు అవార్డులు వచ్చాయి. జాతీయ స్థాయిలో అవార్డుల సంఖ్యను 78 నుంచి 60కు తగ్గించినా.. ఏపీకి 6 అవార్డులు రావడం గమనార్హం.

‘స్టేట్ ఫస్ట్ స్వచ్ఛ్ సిటీ’గా హైదరాబాద్

తెలంగాణలో హైదరాబాద్ నగరానికి ‘స్టేట్ ఫస్ట్ స్వచ్ఛ్ సిటీ’గా అవార్డును అందుకుంది. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల్లో నవీ ముంబై దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. సూరత్ రెండో స్థానంలో, విజయవాడ మూడో స్థానంలో నిలిచాయి. ఈసారి నదీ తీర పట్టణాలు, తీర ప్రాంత పట్టణాలు, హిమాలయ నగరాలకు కూడా ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. నదీ తీర పట్టణాల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని రేవా మొదటి స్థానంలో నిలవగా, తీర ప్రాంత పట్టణాల్లో ఒడిశాలోని పూరీ అగ్రస్థానాన్ని సాధించింది. హిమాలయ నగరాల విభాగంలో ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ మొదటి స్థానంలో నిలిచింది.

ఈ నగరాలను ఎలా ఎంపిక చేస్తారు?

Advertisement

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 పదో ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా 4,751 స్థానిక సంస్థలు పాల్గొన్నాయి. చెత్తను వేరు చేయడం, ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాల సేకరణ, వ్యర్థాల రావాణా, శుద్ధఇ, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగు నీటి నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం వంటి 43 అంశాల ఆధారంగా ఈ రేటింగ్స్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో 3000 మందికి పైగా శిక్షన పొందిన సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 2.70 కోట్ల మంది ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Also Read: 1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

Tags

Related News

వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. దేశంలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్!

భారత్‌లో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలుసా?

ముంబై ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ డోర్లతో కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు.. ఏకంగా 250 ట్రైన్స్..

ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!

Big Stories

Advertisement
×