BigTV English

Old Iphones Resale: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!

Old Iphones Resale: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!

Old Iphones Resale| మీ దగ్గర పాత ఐఫోన్‌లు ఉన్నాయా? అయితే, మీరు జాక్ పాట్ కొట్టినట్లే. ఎందుకంటే ఇప్పుడు వాటికి మార్కెట్లో భారీ రీసేల్ వాల్యూ ఉంది. కొత్త ఫోన్ల ధరలకు మించి ఏకంగా లక్షల్లో వీటికి ధరల పలుకుతోంది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 సిరీస్‌తో, చాలా మంది తమ పాత ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అయితే, కొన్ని పాత ఐఫోన్ మోడల్స్ ఇప్పుడు వింటేజ్ లేదా కలెక్టర్స్ ఐటెమ్‌లుగా మారాయి. కొంతమంది ఐఫోన్ కలెక్షన్ హాబీ ఉన్న కలెక్టర్లు ఈ పాత ఫోన్‌ల కోసం భారీ మొత్తాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ భారీ రీసేల్ వ్యాల్యూ ఉన్న ఐదు పాత ఐఫోన్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. 2025లో మీకు మంచి లాభం తెచ్చిపెట్టవచ్చు.


1. ఒరిజినల్ ఐఫోన్ (2007: మొదటి తరం)
స్టేటస్ : అత్యంత అరుదైన కలెక్టర్స్ ఐటెమ్
అంచనా విక్రయ ధర: సీల్డ్ బాక్స్‌తో రూ. 15,00,000 నుంచి రూ. 50,00,000. 2007లో విడుదలైన ఐఫోన్ 2G అనేది ఆపిల్ మొదటి ఫోన్. స్మార్ట్‌ఫోన్ యుగం ఈ ఫోన్ తోనే ప్రారంభమైంది. సీల్డ్ ఫోన్ లేదా ఉపయోగించని 8GB మోడల్ ఇటీవల ఒక వేలంలో సుమారు రూ. 1.5 కోట్లకు అమ్ముడైంది. ఒకవేళ బాక్స్ తెరిచినా, మంచి స్థితిలో ఉంటే రూ. 50,000 నుంచి రూ. 2 లక్షల వరకు పొందవచ్చు.

2. ఐఫోన్ 3G (2008)
స్టేటస్ : వింటేజ్
అంచనా విక్రయ ధర: రూ. 10,000 నుంచి రూ. 50,000 ఐఫోన్ 3G మొదటి ఐఫోన్. ఈ మోడల్ ఐఫోన్లు ఇంకా పలు దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. అంత అరుదు కాదు, కానీ ఇప్పుడు ఇది వింటేజ్ గా పరిగణించబడుతుంది. కాస్త కర్వ్ గా ఉండే దీని డిజైన్, యాప్ స్టోర్ లోని దీని ఇంట్రడక్షన్ చూస్తే ఇది ఒక నాస్టాల్జీయా ఐటెమ్ గా అనిపిస్తుంది. ఇవే దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంచి కండిషన్‌లో ఉన్న ఈ మోడల్ ఫోన్‌లను కొనడానికి కలెక్టర్లు ఆసక్తి చూపుతారు.


3. ఐఫోన్ 4 (2010: స్టీవ్ జాబ్స్ యుగం)
స్టేటస్ : డిజైన్ ఐకాన్, కలెక్టర్ల ఫేవరెట్
అంచనా విక్రయ ధర: రూ. 15,000 నుంచి రూ. 70,000 ఐఫోన్ 4 గ్లాస్ బాడీ, రెటినా డిస్‌ప్లేతో ఆపిల్ డిజైన్‌లలోనే ఈ ఫోన్ ఒక మైలురాయి. స్టీవ్ జాబ్స్ ఆలోచనలు ఈ ఫోన్‌లో కనిపిస్తాయి. పరిమిత ఎడిషన్ లేదా మంచి స్థితిలో ఉన్న మోడల్స్ కలెక్టర్లకు ఎక్కువ విలువైనవి.

4. ఐఫోన్ 5 (2012: స్టీవ్ జాబ్స్ యొక్క చివరి దృష్టి)
స్టేటస్ : చారిత్రక మోడల్
అంచనా విక్రయ ధర: రూ. 10,000 నుంచి రూ. 35,000 ఐఫోన్ 5 స్టీవ్ జాబ్స్ డిజైన్‌లో పాల్గొన్న చివరి ఫోన్. ఇది అత్యంత అరుదైనది కాకపోయినా, దాని చారిత్రక, భావోద్వేగ విలువ కలెక్టర్లను ఆకర్షిస్తుంది.

5. ఐఫోన్ SE (మొదటి తరం, 2016)
స్టేటస్ : కల్ట్ క్లాసిక్
అంచనా విక్రయ ధర: రూ. 7,000 నుంచి రూ. 25,000 ఐఫోన్ SE చిన్న రూపం మరియు శక్తివంతమైన పనితీరు కలెక్టర్లను ఆకర్షిస్తున్నాయి. సీల్డ్ లేదా మంచి స్థితిలో ఉన్న ఫోన్‌లు రాబోయే సంవత్సరాల్లో మరింత విలువైనవి కావచ్చు.

Also Read: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. త్వరలోనే కొత్త ఛార్జీలు వసూలు

సీల్డ్ ఫోన్‌లు బంగారంతో సమానం
మీ దగ్గర ఈ ఐఫోన్‌లలో ఏదైనా సీల్డ్ బాక్స్‌లో ఉంటే, దాన్ని ఎప్పటికీ తెరవకండి! సీల్డ్ ఫోన్‌లకు కలెక్టర్లు, వేలం హౌస్‌లు భారీ మొత్తాలు చెల్లిస్తాయి.

ఈ పాత ఐఫోన్‌లు మీ ఇంట్లో ఉంటే.. వాటిని జాగ్రత్తగా ఉంచండి, ఎందుకంటే అవి 2025లో మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టవచ్చు!

Related News

Xiaomi Rival iPhone 17: ఐఫోన్ 17కు సవాల్.. రాబోతోంది షావోమీ సూపర్ ఫోన్

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Big Stories

×