OnePlus 13 Price Drop: అమెజాన్ ఇండియా తమ ప్రైమ్ మెంబర్స్ కోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపైన భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది మార్కెట్లోకి వచ్చిన ‘వన్‌ప్లస్ 13’ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. జూలై 6తో ఈ సేల్ ముగియనుండటంతో, కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం.
వన్‌ప్లస్ 13 బేస్ వేరియంట్ (12GB + 256GB) భారత్‌లో లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.72,999గా ఉండేది. కానీ ప్రస్తుత సేల్‌లో ఈ ఫోన్ ధరను నేరుగా రూ.54,999కి తగ్గించారు. అంటే.. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండానే వినియోగదారులకు పెద్ద మొత్తంలో డిస్కౌంట్ లభిస్తోంది. పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరాతో వచ్చే ఈ ఫోన్ ఈ ధరలో లభించడం విశేషం.
Also Read: యాపిల్ లవర్స్‌కు పండగే.. iPhone 17 Pro Maxపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనేయండిలా!
కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా.. అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన కొన్ని బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ.5,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఫోన్ ధర రూ.49,999కి తగ్గుతుంది. ఒకవేళ మీ దగ్గర పాత ఫోన్ ఉండి, దాన్ని ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే ఈ ధర మరింత తగ్గి రూ.37,500కే ఈ ప్రీమియం ఫోన్ మీ సొంతం అవుతుంది.
ఈ ప్రత్యేకమైన ఆఫర్లు కేవలం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి. మీ దగ్గర ప్రైమ్ మెంబర్‌షిప్ లేకపోతే ఈ తగ్గింపు ధరలను పొందడం సాధ్యం కాదు. ప్రస్తుతం మార్కెట్లో దీని తర్వాతి మోడల్ అయిన OnePlus 15 అందుబాటులో ఉన్నప్పటికీ.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి OnePlus 13 ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఒకవైపు పాత మోడళ్లపై ఆఫర్లు నడుస్తుండగానే.. కంపెనీ తమ తదుపరి సరికొత్త మోడల్ OnePlus 16 లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం చివర్లో లేదా నాలుగో త్రైమాసికం ప్రారంభంలో ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సేల్‌లో వన్‌ప్లస్‌తో పాటు మరికొన్ని బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కూడా భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి.
Also Read: నోకియా నుంచి AI ఫీచర్లతో 4G కీప్యాడ్ ఫోన్లు.. బటన్ నొక్కితే చాలు అన్నీ అదే చూసుకుంటుంది!