Best wet and dry vacuum cleaners 2026: సాధారణంగా మనం వాడే వాక్యూమ్ క్లీనర్లు కేవలం ఎండు దుమ్ము, చెత్తను మాత్రమే క్లీన్ చేయగలవు. పొరపాటున నేలపై పాలు, కాఫీ లేదా సాస్ లాంటి లిక్విడ్స్ పడితే వాటితో క్లీన్ చేయలేం. కానీ.. ‘వెట్ అండ్ డ్రై’ (Wet & Dry) వాక్యూమ్ క్లీనర్లతో ఆ టెన్షన్ అస్సలు ఉండదు. ఇవి దుమ్ము, ధూళితో పాటు కింద పడిన ద్రవ పదార్థాలను కూడా ఒక్క స్పాట్ వదలకుండా.. క్లీన్ చేస్తాయి. అమెజాన్‌లో బెస్ట్ రేటింగ్స్, పవర్‌ఫుల్ సక్షన్ కెపాసిటీ ఉన్న 5 బెస్ట్ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్స్ , వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాక్యూమ్ క్లీనర్స్ అనగానే మన దేశంలో అందరికీ గుర్తొచ్చే మొదటి బ్రాండ్ యురేకా ఫోర్బ్స్. ఈ ట్రెండీ మోడల్ మీ ఇంటి క్లీనింగ్ అవసరాలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇందులో 800 వాట్స్ పవర్‌ఫుల్ మోటార్ ఉంది. కాబట్టి ఇది డస్ట్‌తో పాటు కింద పడిన లిక్విడ్స్‌ను చాలా ఈజీగా లాగేస్తుంది. దీనికున్న స్మార్ట్ వీల్స్ వల్ల ఇంటి చుట్టూ తిప్పడం చాలా ఈజీ.
ధర: సుమారు రూ.7,500 నుంచి రూ.8,500 వరకు ఉంటుంది.
కెంట్ కంపెనీకి చెందిన ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఒక కాంపాక్ట్ ,పవర్‌ఫుల్ ఆప్షన్. ఇల్లు, కార్ క్లీనింగ్ రెండింటికీ ఇది చాలా బెస్ట్. అంతే కాకుండా ఇది కార్డ్‌లెస్ స్టైల్‌లో కూడా కొన్ని మోడల్స్ ఆఫర్ చేస్తుంది. దీని హై-ఎఫిషియన్సీ హెపా (HEPA) ఫిల్టర్ గాలిలోని మైక్రో బ్యాక్టీరియాను కూడా ఫిల్టర్ చేస్తుంది. అంతే కాకుండా ఒలికిన లిక్విడ్స్‌ను ఒక్క డ్రాప్ కూడా వదలకుండా క్లీన్ చేస్తుంది.
ధర: సుమారు రూ.6,500 నుంచి రూ.7,800 వరకు ఉంటుంది.
మీకు హెవీ డ్యూటీ పర్ఫార్మెన్స్, బడ్జెట్ ధరలో కావాలంటే అగారో బెస్ట్ ఛాయిస్. ప్రస్తుతం అమెజాన్‌లో ఇది టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్. 1600 వాట్స్ పవర్‌ఫుల్ మోటార్ అండ్ 21 లీటర్ల పెద్ద కెపాసిటీ ట్యాంక్ దీని సొంతం. ఎంత పెద్ద ఇల్లయినా లేదా ఆఫీస్ అయినా సరే ఇది చెత్తను, లిక్విడ్స్‌ను ఇట్టే క్లీన్ చేస్తుంది. దీని జంబో సైజ్ వల్ల పదే పదే డస్ట్ ట్యాంక్ క్లీన్ చేయాల్సిన పనిలేదు.
ధర: సుమారు రూ.5,200 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ లో ఇనాల్సా కూడా చాలా పాపులర్. తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్స్ ఇచ్చే బ్రాండ్ ఇది.
ఫీచర్స్: ఇది 1400 వాట్స్ పవర్‌తో వస్తుంది. ఇంపాక్ట్ రెసిస్టెంట్ ప్లాస్టిక్ బాడీ కావడం వల్ల చాలా కాలంపాడవకుండా ఉంటుంది. డ్రై వాక్యూమింగ్, వెట్ మ్యాపింగ్ అండ్ బ్లోయర్.. ఇలా 3-ఇన్-1 ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి.
ధర: సుమారు రూ.3,800 నుంచి4,500 వరకు దీని ధర ఉంటుంది.
Also Read: సినిమా హాల్ లాంటి ఫీల్.. తక్కువ బడ్జెట్‌లో టాప్ 5 స్మార్ట్ ప్రొజెక్టర్స్
జర్మన్ టెక్నాలజీతో వచ్చే కార్చర్ బ్రాండ్ క్లీనింగ్‌కు కేరాఫ్ అడ్రస్. ప్రీమియం క్వాలిటీ కోరుకునే వారికి ఇది నచ్చుతుంది. అంతే కాకుండా ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. దీని అడ్వాన్స్‌డ్ ఫిల్టర్ కార్ట్రిడ్జ్ వల్ల వెట్ అండ్ డ్రై క్లీనింగ్ కోసం ఫిల్టర్ మార్చాల్సిన అవసరం లేదు. చాలా కఠినమైన మురికిని కూడా ఇది లాగేస్తుంది.
ధర: సుమారు రూ.8,500 నుంచి రూ.9,800 వరకు ఉంటుంది.
వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్‌తో లిక్విడ్స్ క్లీన్ చేసిన ప్రతిసారీ.. లోపల ఉన్న బకెట్ లేదా ట్యాంక్‌ను వెంటనే.. కడిగేసి ఆరబెట్టండి. లేదంటే.. లోపల బ్యాక్టీరియా చేరి బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మన సమయాన్ని, ఓపికను ఆదా చేసే ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఇంట్లో ఉండటం చాలా అవసరం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ లేదా పండగ ఆఫర్లలో ఇవి ఇంకా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.