Best projectors under 20000: ఒకప్పుడు ఇంట్లోనే థియేటర్ లాంటి స్క్రీన్ ఫీల్ పొందాలంటే లక్షల్లో ఖర్చు పెట్టి పెద్ద సైజ్ స్మార్ట్ టీవీలు లేదా ప్రీమియం ప్రొజెక్టర్లు కొనాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అప్‌డేట్ అవ్వడంతో బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ప్రొజెక్టర్స్ మార్కెట్లోకి వచ్చాయి. జస్ట్ రూ. 20,000 లోపు బడ్జెట్‌లోనే అల్ట్రా హెచ్‌డీ సపోర్ట్, ఇన్-బిల్ట్ నెట్‌ఫ్లిక్స్, అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌తో వస్తున్న టాప్ 5 హోమ్ థియేటర్ ప్రొజెక్టర్స్, వాటి లేటెస్ట్ ధరల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వీకెండ్ వస్తే చాలు.. పాప్‌కార్న్ పట్టుకుని ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం ఈ రోజుల్లో.. ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద రిలాక్సేషన్. అయితే చిన్న మొబైల్ స్క్రీన్లలోనో, లేదా నార్మల్ టీవీల్లోనో చూస్తే ..ఆ థియేటర్ వైబ్ అస్సలు రాదు. ఇప్పుడు ఇండియాలో ‘హోమ్ సినిమా’ సెటప్‌కి క్రేజ్ విపరీతంగా పెరిగింది. అందుకే.. మీ కోసం వంద ఇంచుల కంటే ..పెద్ద స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఐదు బెస్ట్ ప్రొజెక్టర్లను రూ. 20వేల బడ్జెట్‌లిస్ట్..
ఈ మధ్య కాలంలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన లుమియో ప్రొజెక్టర్ రంగంలో.. ఒక సంచలనం సృష్టిస్తోంది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ ఇవ్వడం దీని స్పెషాలిటీ.
ఫీచర్స్: ఇది అఫీషియల్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అంటే ఇందులో.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమా వంటివి ఇన్-బిల్ట్‌గా స్మూత్‌గా రన్ అవుతాయి. ఇది నేటివ్ 1080p ఫుల్ హెచ్‌డీతో పాటు 4K కంటెంట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆటో కీస్టోన్, డాల్బీ ఆడియో దీని స్పెషల్ అట్రాక్షన్.
ధర: సుమారు రూ16,000 నుంచి రూ.18,500 వరకు ఉంటుంది.
ఆడియో ,స్మార్ట్ గ్యాడ్జెట్స్‌లో క్రోస్‌బీట్స్ బ్రాండ్‌కు మంచి పేరుంది. వారి లూమెక్స్ ఫ్లిక్స్ మోడల్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్.
ఫీచర్స్: ఆండ్రాయిడ్ 13 తో వచ్చే ఈ స్మార్ట్ మినీ ప్రొజెక్టర్ ఏకంగా 16,000 ల్యుమెన్స్ బ్రైట్‌నెస్‌ను ఆఫర్ చేస్తుంది. రూమ్‌లో కొద్దిగా లైటింగ్ ఉన్నా కూడా విజువల్స్ చాలా బ్రైట్‌గా కనిపిస్తాయి. ఇది గరిష్టంగా 300 ఇంచుల భారీ డిస్‌ప్లేను ప్రొజెక్ట్ చేయగలదు.
ధర: సుమారు రూ.18,000 నుంచి రూ.19,999 వరకు ఉంటుంది.
3. Boat CineHead M1:
మన అందరికీ నచ్చిన బోట్ (boAt) బ్రాండ్ నుంచి వచ్చిన సరికొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ ఇది. యూత్ , బ్యాచిలర్స్ రూమ్స్‌కు ఇది చాలా బాగా సెట్ అవుతుంది.
ఫీచర్స్: దీని కాంపాక్ట్ డిజైన్ వల్ల దీన్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయవచ్చు. 200 ANSI ల్యుమెన్స్ బ్రైట్‌నెస్, నేటివ్ ఫుల్-హెచ్‌డీ రిజల్యూషన్‌తో వస్తుంది. ఆటో ఫోకస్ , ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్స్ వల్ల స్క్రీన్ సెట్టింగ్స్ మార్చడం చాలా ఈజీ.
ధర: సుమారు రూ.14,999 నుంచి రూ. 16,999 వరకు ఉంటుంది.
Also Read: రూ.1,999కే 18 రోజుల బ్యాటరీ లైఫ్..హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న స్మార్ట్‌వాచ్!
4. WZATCO Yuva Vibe:
ప్రొజెక్టర్ మార్కెట్లో డబ్ల్యూజాట్కో చాలా కాలంగా నమ్మకమైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. తక్కువ ధరలో ఎక్కువ లైఫ్ ఇచ్చే ల్యాంప్స్ వీటికి ఉంటాయి.
ఫీచర్స్: ఇది 14,000 ల్యుమెన్స్ బ్రైట్‌నెస్, 4K HDR సపోర్ట్‌తో వస్తుంది. అందుకే సినిమా చూస్తున్నప్పుడు రిచ్ కలర్స్, షార్ప్ విజువల్స్ అందించడంలో.. ఇది ది బెస్ట్. వై-ఫై6 కనెక్టివిటీ ఉండటం వల్ల బఫరింగ్ లేకుండా ఆన్‌లైన్ వీడియోలు చూసేయొచ్చు.
ధర: సుమారు రూ.13,500 నుంచి 15,000 వరకు ఉంటుంది.
5. XElectron iProjector 2 Plus:
ఎక్కువ స్టోరేజ్ , ల్యాగ్‌లెట్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఎక్స్-ఎలక్ట్రాన్ ఒక క్రేజీ ఆప్షన్.
ఫీచర్స్: ఈ బడ్జెట్‌లో చాలా అరుదుగా లభించే 2GB RAM మరియు 32GB ROM స్టోరేజ్ ఇందులో ఉంది. దీనివల్ల యాప్స్ చాలా స్పీడ్‌గా ఓపెన్ అవుతాయి. అలాగే దీని కాంట్రాస్ట్ రేషియో చాలా బాగుండటం వల్ల చీకటి సీన్లు కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.
ధర: సుమారు రూ.15,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది.
బడ్జెట్ ప్రొజెక్టర్ కొనేటప్పుడు కేవలం ల్యుమెన్స్ మాత్రమే కాదు.. ANSI Lumens , Native Resolution (కనీసం 1080p ఉండేలా) చెక్ చేసుకోండి. ఇవే మీకు నిజమైన థియేటర్ క్వాలిటీ పిక్చర్‌ను ఇస్తాయి.
చివరిగా చెప్పేదేంటంటే.. రూ.20వేల లోపు వచ్చే ఈ స్మార్ట్ ప్రొజెక్టర్లను ఒక మంచి వైట్ వాల్ (గోడ) లేదా ప్రొజెక్టర్ స్క్రీన్‌పై ప్లే చేసి, చిన్న సౌండ్‌బార్ కనెక్ట్ చేస్తే.. మీ ఇల్లు మినీ ఐమాక్స్ అవ్వడం ఖాయం.