Buy OnePlus Nord CE 3 Lite 5G at Rs 1399 Only: ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్త కొత్త్ ఫీచర్లతో రకరకాల మోడళ్లు దర్శనమిస్తున్నాయి. ఫోన్ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రముఖ కంపెనీలు అప్‌గ్రేడెడ్ టెక్నాలజీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.
ఇప్పటికే చాలా కంపెనీల నుంచి పలు మోడళ్లు ఫోన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. అయితే అందులో వన్‌ప్లస్ కంపెనీ ఒకటి. ఈ వన్‌ప్లస్ కంపెనీకి మార్కెట్‌లో సూపర్ డూపర్ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి మొబైల్ లాంచ్ అవుతుందంటే ఫోన్ ప్రియులు ఎగబడి కొనేందుకు ముందుంటారు.
అయితే ఇటీవల ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఓ ఫోన్ మంచి ఆదరణ అందుకుంది. అంతేకాకుండా దాని కెమెరా, ఫోన్ స్పీడ్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.
Also Read: వన్‌ప్లస్ నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే!
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) స్మార్ట్‌ఫోన్ గతేడాది విడుదలైంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది. ఇది రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.
అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. లాంచ్ సమయం కంటె అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో బంపరాఫర్ అందుబాటులో ఉండాలి. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో 10 శాతం తగ్గింపుతో 17,999కి లిస్ట్ అయింది.
అలాగే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఇప్పుడు దీనిపై అమెజాన్‌లో 9శాతం తగ్గింపుతో రూ.19,999కి అందుబాటులో ఉంది. అలాగే వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Also Read: కిర్రాక్ ఆఫర్: ఇయర్ బడ్స్ ధరకే 5జీ మొబైల్.. ఎలాగో తెలుసుకోండి..
హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై రూ.1000 తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది.
8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,999 ఉండగా.. దీనిపై ఇప్పుడు రూ.16,600 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే 8GB ర్యామ్+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 ఉండగా.. ఇప్పుడు దీనిపై రూ.18000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ పూర్తిగా వర్తిస్తే.. బేస్ వేరియంట్ ధర రూ.1399కి లభిస్తుంది. అలాగే టాప్ వేరియంట్ ధర రూ.1999కి పొందొచ్చు. అయితే ఈ మొత్తం ఎక్స్చేంజ్ ఆఫర్ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్, వర్కింగ్‌లో అందుబాటులో ఉండాలి. లేకపోతే మొత్తం ఆఫర్ వర్తించదు.