E-Paper
Advertisement

ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో నిమిషాల్లో ఖాళీ

ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో నిమిషాల్లో ఖాళీ
Advertisement

How to free up phone storage: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అయితే.. ఎంత ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ కొన్నా.. కొద్దిరోజులకే ‘స్టోరేజ్ ఫుల్’ అనే నోటిఫికేషన్ కనిపిస్తూనే ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ మెసేజ్‌లతో మెమరీ నిండిపోయి, ఫోన్ నెమ్మదించడం లేదా హ్యాంగ్ అవ్వడం మొదలవుతుంది. దీని కోసం అవసరమైన యాప్స్‌ను డిలీట్ చేయాల్సిన పనిలేదు. కేవలం కొన్ని సింపుల్ హిడెన్ ట్రిక్స్ ఉపయోగించి మీ ఫోన్ స్టోరేజ్‌ను నిమిషాల్లో ఎలా ఖాళీ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా?

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి ఫోన్లలో.. డేటా పేరుకుపోవడం సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది స్టోరేజ్ నిండిపోగానే గ్యాలరీలోని ఫోటోలు, వీడియోలు లేదా ముఖ్యమైన యాప్స్‌ను డిలీట్ చేస్తుంటారు. కానీ.. గూగుల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్స్ , కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ద్వారా మనకు తెలియకుండానే దాగి ఉన్న వేస్ట్‌ డేటాను తొలగించి జీబీల్లో స్పేస్‌ను సొంతం చేసుకోవచ్చు.

Advertisement

1. క్యాచీ డేటా క్లియర్ చేయండి:
మనం రోజూ వాడే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, క్రోమ్ వంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో భారీగా ‘క్యాచీ డేటా’ను స్టోర్ చేసుకుంటాయి. ఇవి యాప్స్ త్వరగా ఓపెన్ అవ్వడానికి సహాయపడినప్పటికీ.. కాలక్రమేణా జీబీలలో స్టోరేజ్‌ను ఆక్రమిస్తాయి.

ట్రిక్: మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ లేదా App Management పై క్లిక్ చేయండి. ఎక్కువ డేటా వాడే యాప్‌ను సెలెక్ట్ చేసి, Storage ఆప్షన్‌లోకి వెళ్లి ‘Clear Cache’ క్లిక్ చేయండి. (గమనిక: Clear Data కొడితే మీ లాగిన్ వివరాలు పోతాయి. కాబట్టి కేవలం Clear Cache మాత్రమే చేయాలి).

Advertisement

2. వాట్సాప్ ‘మీడియా విజిబిలిటీ, ‘మేనేజ్ స్టోరేజ్’:
మన ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోవడానికి ప్రధాన కారణం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే గుడ్ మార్నింగ్ ఇమేజ్‌లు, ఫార్వార్డెడ్ వీడియోలు.

ట్రిక్: వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Storage and Data గ్రూప్‌లోని Manage Storage ఆప్షన్‌ను ఓపెన్ చేయండి. అక్కడ 5MB కంటే ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్, పదే పదే ఫార్వార్డ్ అయిన వీడియోలు విడిగా కనిపిస్తాయి. వాటిని ఒకే క్లిక్‌తో డిలీట్ చేయవచ్చు. అలాగే, Media Visibility ని ఆఫ్ చేయడం ద్వారా పనికిరాని ఫోటోలు నేరుగా గ్యాలరీలోకి రాకుండా ఆపవచ్చు.

3. ‘గూగుల్ ఫైల్స్’ (Files by Google) యాప్ వాడండి:
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ అందించిన అద్భుతమైన టూల్ ఇది. ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫోన్‌లోని డూప్లికేట్ ఫైల్స్, పాత స్క్రీన్ షాట్స్, అవసరం లేని పెద్ద ఫైల్స్‌ను గుర్తించి మీకు చూపిస్తుంది. కేవలం ఒక్క ట్యాప్‌తో వాటన్నింటినీ క్లీన్ చేయవచ్చు.

Also Read: తక్కువ ధరలో పెద్ద స్క్రీన్, అదిరిపోయే సౌండ్..రూ.30వేలలోపే స్మార్ట్ టీవీలు

4. ఫోటోలు, వీడియోలను ‘క్లౌడ్’ కి మార్చండి:
మీ ఫోన్ గ్యాలరీలో వేల సంఖ్యలో ఉన్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నల్ మెమరీని తినేస్తుంటాయి. దీనికి బదులుగా గూగుల్ ఫోటోస్ లేదా వన్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌ను ఉపయోగించండి. ఫోటోలను క్లౌడ్‌లో బ్యాకప్ చేసిన తర్వాత.. ఫోన్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫోన్ మెమరీ ఖాళీ అవ్వడమే కాకుండా.. ఫోన్ పోయినా మీ ఫోటోలు సురక్షితంగా ఉంటాయి.

5. అన్‌యూజ్డ్ యాప్స్ ఆటో-ఆర్కైవ్:
గూగుల్ ప్లే స్టోర్‌లో ఇటీవల వచ్చిన అద్భుతమైన అప్‌డేట్ ‘ఆటో ఆర్కైవ్’. మనం కొన్ని యాప్స్‌ను ఎప్పుడో ఒకసారి వాడుతుంటాం. ఈ ఫీచర్ ఆన్ చేయడం ద్వారా.. మీరు చాలా రోజులుగా వాడని యాప్స్ యొక్క డేటాను డిలీట్ చేయకుండా, కేవలం యాప్ సైజును తగ్గిస్తుంది. అవసరమైనప్పుడు మళ్లీ క్లిక్ చేస్తే అక్కడి నుంచే రీ-స్టోర్ అవుతుంది.

స్టోరేజ్ సమస్యను అధిగమించడానికి వారానికి ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేయడం, నెలకు ఒకసారి క్యాచీ క్లియర్ చేయడం అలవాటు చేసుకోండి. ఈ సింపుల్ ట్రిక్స్ పాటించడం ద్వారా మీ ఫోన్ స్టోరేజ్ పెరగడమే కాకుండా.. మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఫాస్ట్‌గా మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ ట్రిక్స్ ట్రై చేయండి.

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×