BigTV English

OnePlus 5G Mobile Offer: మళ్లీ ఆఫర్లు.. వన్‌ప్లస్ 5G ఫోన్‌పై భారీ ఆఫర్.. దుమ్ములేపారు పో!

OnePlus 5G Mobile Offer: మళ్లీ ఆఫర్లు.. వన్‌ప్లస్ 5G ఫోన్‌పై భారీ ఆఫర్.. దుమ్ములేపారు పో!

OnePlus 5G Mobile Offer: టెక్ దిగ్గజం వన్‌ప్లస్ Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఇది 108 మెగాపిక్సెల్ కెమెరా సెగ్మెంట్‌లో చీపెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్. మీరు కొత్త OnePlus ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇది చాలా మంచి ఆఫర్ కానుంది. ఈ ఫోన్ పవర్‌ఫుల్ కెమెరాతో పాటు, భారీ ర్యామ్, వేగవంతమైన ప్రాసెసర్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌పై లభించే డీల్స్ గురించి మీకు వివరంగా తెలుసుకుందాం.


OnePlus Nord CE 3 Lite 5G ఫోన్‌‌ను రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ అయింది. లాంచ్ సమయంలో దాని 128GB వేరియంట్ ధర రూ.19999, 256GB వేరియంట్ ధర రూ.21999. రెండు వేరియంట్‌లు స్టాండర్డ్ 8GB RAMని కలిగి ఉన్నాయి. ఇది క్రోమాటిక్ గ్రే, పాస్టెల్ లైమ్ కలర్‌లో లాంచ్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ ప్రకటించింది. దీని తర్వాత ఫోన్ రూ. 14,000కి లభిస్తుంది.

Also Read: రప్ఫాడించారు.. HMD నుండి మరో బడ్జెట్ ఫోన్.. పక్కా బ్లాక్‌బస్టర్..!


128GB స్టోరేజ్‌తో ఫోన్ పాస్టెల్ లైమ్ కలర్ వేరియంట్ రూ.16,579కి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే క్రోమాటిక్ గ్రే కలర్ వేరియంట్ రూ.16,999కి లభిస్తుంది. అంటే 128GB పాస్టెల్ లైమ్ కలర్ వేరియంట్ దాని లాంచ్ ధర కంటే ఫ్లాట్ రూ. 3,420 తక్కువగా అందుబాటులో ఉంది. ఫోన్‌పై అనేక బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి.

మీకు HSBC బ్యాంక్ కార్డ్ ఉంటే మీరు EMI ట్రాన్జాక్షన్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ. 2500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు పూర్తి బ్యాంక్ ఆఫర్‌ను ఉపయోగించుకున్నట్లయితే ధర రూ. 14,079 మాత్రమే. అంటే లాంచ్ ధర కంటే రూ. 5,920 తక్కువకు దక్కించుకోవచ్చు. డీల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G‌ ఫోన్ 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 680 nits పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB RAM కలిగి ఉంటుంది.

Also Read: రేటు తగ్గింది పుష్ప.. రూ.7 వేల డిస్కౌంట్.. మోటో కొత్త స్మార్ట్‌ఫోన్!

ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. SuperVOOC ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్‌తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు కూడా ఉన్నాయి.

Related News

Prepaid Cards: ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డు.. క్రెడిట్ స్కోర్ అవసరం లేకుండా సులభ లావాదేవీలు

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Google Veo 3 Free: ఏఐ వీడియోలు చేయడం పూర్తిగా ఫ్రీ.. గూగుల్ వియో 3 ఇప్పుడే ట్రై చేయండి!

Big Stories

×