Kim Kardashian: ఇండస్ట్రీ.. ఒక గ్లామర్ ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్స్ .. వారికి అందం లేనిదే ఇండస్ట్రీలో ఉండలేరు. అందుకే అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. వయస్సు పెరిగేకొద్దీ ఆ అందానికి మెరుగులు అద్దుతూ ఉంటారు. కొంతమంది న్యాచురల్ గా అందాన్ని పెంచుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది సర్జరీలతో అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అందాన్ని మెరుగుపర్చుకోవడానికి చేయని సర్జరీ లేదు.
ఇక అంతేనా కడుపు మాడ్చుకొని, చెమటలు చిందించి ముఖానికి మెరుగులు దిద్దుతుంటారు. ఆ అందాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు.. ? ఎంతకైనా దిగజారతారు. తాజాగా ఒక హాలీవుడ్ నటి.. తన అందాన్ని కాపాడుకోవడానికి ఏది తినడానికి అయినా రెడీ అని చెప్పుకొచ్చింది. హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Look Back 2024 : ఈ ఏడాది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు… ఎంతమందికి కలిసి వచ్చిందంటే?
ప్రపంచంలోనే అందమైన నటిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటిగా కూడా కిమ్ కు రికార్డ్ ఉంది. అలాంటి కిమ్.. తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక తన బ్యూటీ సీక్రెట్ ను బయటపెట్టింది. ఆమె తన ముఖానికి సాల్మన్ చేపల వీర్యంతో తయారుచేసిన ఫేషియల్ చేయించుకుంటానని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఫేషియల్ హాలీవుడ్ నటీమణులకు చాలా సాధారణం.
సాల్మన్ చేపలను ఫ్రెష్ గా తీసుకొని.. వాటి నుంచి వీర్యాన్ని సేకరించి.. దాంతో ఫేషియల్ ను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ-మిల్ట్ లేదా ఫిష్ వీర్యం నుండి తీసుకోబడిన పాలీన్యూక్లియోటైడ్‌ల ఇంజెక్షన్‌ను కలిగి ఉంటుంది. చర్మ పునరుత్పత్తిని పెంచుతుందని, కొత్త కొల్లాజెన్ ఉత్పత్తిని చేస్తుంది. దానివలన ముఖం నిగనిగలాడుతుందంట.
Sobhita: యంగ్ పీపుల్ పార్టీలో నాగచైతన్య భార్య.. వెరైటీ గెటప్‌లో శోభితా హంగామా
ఇక కిమ్ మాట్లాడుతూ.. ” ఒకవేళ ఎవరైనా వచ్చి.. మీరు మలం తింటే ఇంకా అందంగా తయారవుతారు అంటే నేను దాన్ని తినడానికి కూడా రెడీ. అయితే అక్కడవరకు వెళ్ళను. ఒకప్పుడు నేను ఇలాంటి ప్రొడక్స్ట్ వాడాలనుకోలేదు. వీటిని వాడేవారిని ఎగతాళి చేశాను. కానీ, నేను ఇప్పుడు వీటిపైనే ఆధారపడ్డాను. ఎర్‌హోన్ స్మూతీస్, యాక్టివేట్-చార్‌కోల్ మాస్క్‌లు, నత్త మ్యూకిన్ నుంచి షార్క్ సాస్ ల వరకు నా ముఖం పై ఎన్నో ప్రొడక్స్ట్ పెడుతూనే వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ ఇంటర్వ్యూ పాతది అయినా కూడా మళ్లీ వైరల్ గా మారింది.