BigTV English

Open Ai : టెక్ట్స్ నుంచి నేరుగా వీడియో!

Open Ai : టెక్ట్స్ నుంచి నేరుగా వీడియో!
Open Ai Latest Update

Open Ai Latest Update : ఓపెన్ ఏఐ సంస్థ మరో బాంబ్ షెల్! జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో విప్లవాత్మకంగా నిలిచిపోయే టూల్‌ను ఆవిష్కరించింది. మనం టెక్ట్స్ ఇస్తే చాలు.. షార్ట్ వీడియోలను రూపొందించే అద్భుతమైన సాధనమిది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ సంస్థ టెక్ట్స్-టూ-వీడియో జనరేటర్ సొరను విడుదల చేసింది. అయితే ఈ తరహా టూల్‌ను రూపొందించడం ఇదే తొలిసారి కాదు. గూగుల్, మెటా, స్టార్టప్ రన్‌వే ఎంఎల్ వంటి ఇతర కంపెనీలు ఇలాంటి సాంకేతికతను పరిచయం చేశాయి.


read more : చంద్రునిపై సౌండ్ ఉండదు..!

అయితే సొర టూల్ తో రూపొందించిన వీడియోలను చూస్తే అత్యంత క్వాలిటీతో ఉండటం విశేషం. టెక్ట్స్-టూ-వీడియో డిఫ్యూషన్ మోడల్ ద్వారా రూపొందే వీడియోల నిడివి నిమిషమే. కానీ వాస్తవికతకు అతి దగ్గరగా ఉంటాయి. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఆ వీడియోలను విడుదల చేశారు. సోషల్ మీడియా యూజర్ల నుంచి రిటెన్ ప్రాంప్ట్స్(written prompts) ఐడియాలను ఆహ్వానిస్తూ ఆయనీ వీడియోలను జత చేశారు.


అయితే ఓపెన్ ఏఐ ఆ టూల్‌కు సంబంధించి వివరాలను పరిమితంగానే వెల్లడించింది. దానిని ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాలేదు. క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌కు ఈ టూల్‌ను ఎంత ప్రయోజనకరంగా తీర్చిదిద్దగలమన్న అంశంపై విజువల్ ఆర్టిస్టులు, డిజైనర్లు, ఫిల్మ్ మేకర్ల నుంచి ఓపెన్ ఏఐ సంస్థ ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×