BigTV English

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం.. సూచనలివ్వాలని ప్రతిపక్షాలను కోరిన సీఎం..

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం.. సూచనలివ్వాలని ప్రతిపక్షాలను కోరిన సీఎం..
Telangana Assembly Live Updates

Telangana Assembly Live Updates(Breaking news in telangana): తెలంగాణ శాసన సభలో బీసీ కుల గణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. కులగణన తీర్మానం పై అనుమానం ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విపక్ష సభ్యులకు సూచించారు. తీర్మానం పై ఏదైనా లీగల్ చిక్కులపై ప్రతిపక్షాలకు ఏమైనా తెలిస్తే తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలని కోరారు.


కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకు ముందు కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కడియంను తప్పుదోవ పట్టించే వాళ్లను బయటకు పంపాల్సిందే లేదంటే గాలి సోకుతుందన్నారు. ఆనాడు రిజర్వేషన్లు అయితేనే ఆయా సామాజిక నేతలు చట్ట సభల్లోకి వస్తున్నారన్నారు.

Read More: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ..


మేనిఫెస్టోలపై ఓరోజు చర్చ పెడదామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
2014, 2018, 2023లో పార్టీల మేనిఫెస్టో లపై ప్రత్యేకంగా చర్చిద్దామన్నారు. కాంగ్రెస్
ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే కేబినెట్ ఆమోదంతో సభలో బీసీ కులగణన తీర్మానం పెట్టామన్నారు. ఈ పదేళ్లపాటు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. బలహీన వర్గాలను బలంగా మార్చడమే బీసీ కులగణన తీర్మానం లక్ష్యమని స్పష్టంచేశారు. కులగణనపై అనుమానాలొద్దన్నారు.

కులగణనపై.. ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్ష నేతలు మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చట్ట సభల్లో అన్నికులాలకు న్యాయం చేసేందుకే కులగణన చేపడతామన్నారు. గతంలో కాంగ్రెస్‌ జస్టిస్‌ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ అప్పుడు ఆ సర్వేను వాడుకుందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానం సభ ఆమోదం పొందింది.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×