BigTV English
Advertisement

OPPO A3x 5G: చౌక ధరలో ఒప్పో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు చాలా బాగున్నాయ్..!

OPPO A3x 5G: చౌక ధరలో ఒప్పో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు చాలా బాగున్నాయ్..!

OPPO A3x 5G Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ OPPO తాజాగా భారతీయ మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ OPPO A3x 5Gని లాంచ్ చేసింది. Oppo నుండి వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, మెరుగైన ప్రాసెసర్, 5,100mAh బ్యాటరీ వంటి అనేక ఉన్నాయి. ఇప్పుడు ఈ OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధరతో పాటు ఇతర సమాచారాన్ని తెలుసుకుందాం.


OPPO A3x 5G Price

OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,499 ధరతో రిలీజ్ అయింది. అలాగే 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,499 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్రీ పర్పుల్, స్పార్కిల్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను OPPO అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్‌లలో ఆగస్టు 7 నుండి కొనుగోలు చేయవచ్చు.


OPPO A3x 5G Specifications

OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 nits పీక్ బ్రైట్‌నెస్ వంటివి ఉన్నాయి. అలాగే పంచ్-హోల్ కటౌట్ ఉంది. ఇది మీ వేళ్లు తడిగా లేదా అంటుకునేలా ఉన్నప్పటికీ స్క్రీన్‌ను సూపర్ రెస్పాన్సివ్‌గా ఉంచుతుంది. A3x 5G మిలిటరీ-గ్రేడ్ MIL-STD 810H పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఇది షాక్, డ్రాప్ రెసిస్టెంట్‌గా చేసింది. భద్రత కోసం స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. OPPO A3x 5G ఫోన్ వెనుకవైపు 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. OPPO A3x 5Gలో MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇవ్వబడింది. ఇది 4GB RAM, 64GB/128GB స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉంది. 4GB వర్చువల్ మెమరీ కూడా ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించవచ్చు. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది.

Related News

Jio-Google Gemini Pro: జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త… 18 నెలల పాటు ఉచితమే!

ChatGPT – OpenAI: షాకింగ్.. సూసైడ్ ఆలోచనలో 12లక్షల మంది ChatGPT యూజర్స్!

Realme C85 Pro: విడుదలకు ముందే.. Realme C85 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్ లీక్!

Vivo X300 Series: ఇవాళే Vivo X300 సిరీస్ లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కిర్రాక్ అంతే!

YouTube New Feature: యూట్యూబ్ షాకింగ్ డెసిషన్.. ఇక నుంచి అలా చెయ్యలేరు!

Lines on Keyboard: కీబోర్డ్‌ లో F, J మీద చిన్న లైన్స్.. ఎందుకు ఉంటాయో తెలుసా?

Pocket Size Printer: జేబులో సరిపోయే ఫొటో ప్రింటర్.. షావోమీ కొత్త గాడ్జెట్ గురించి తెలుసా

Calling Name Presentation: టెస్టింగ్ టైమ్.. మొబైల్ స్క్రీన్లలో ఇకపై వ్యక్తి పేరు, డిజిటల్ అరెస్టులకు బ్రేక్?

Big Stories

×