BigTV English

Gastritis: గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలు మీ కోసమే

Gastritis: గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలు మీ కోసమే

Gastritis: బిజిబిజీగా ఉండే ప్రస్తుత లైఫ్ లో బయట ఫుడ్ తినడానికి చాలా అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ తింటూ చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు తరచూ పార్టీలు, ఫంక్షన్లు అంటూ బిర్యాణీలు, చాలా రకాల మసాలా ఫుడ్ వంటివి తీసుకుంటుంటారు. దీని కారణంగా జీర్ణ సంబంధింత సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ వంటి చాలా సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.


సాధారణంగా తినే ఆహారం కారణంగా కడుపులో మంట వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ తరచూ కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తుంటే మాత్రం అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదని నిపుణులు అంటున్నారు. గ్యాస్ సమస్య ఏర్పడగానే ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు స్పైసీ ఫుడ్, ఆయిల్, కారం వంటి ఆహార పదార్థాలు తీసుకుంటే గ్యాస్ సమస్యలు తరచూ వస్తుంటాయి. అయితే గ్యాస్ సమస్య ఎదురైనప్పుడు కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపులో గ్యాస్ ఉన్నట్లయితే ఈ చిట్కాలు పాటించండి..


కొబ్బరి నీళ్లు :

కడుపులో మంట లేదా గ్యాస్ సమస్యలు తలెత్తిన సమయంలో కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఉపశమనం కలిగిస్తాయి. అందువల్ల గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు తప్పనిసరిగా కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటమే కాకుండా జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

కీర దోసకాయ :

కీరదోస తినడం వల్ల పొట్టలోని గ్యాస్ సమస్యను దూరం చేయడం మాత్రమే కాకుండా ఆకలిని తగ్గించి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

నిమ్మకాయ నీరు :

గ్యాస్ సమస్య ఉన్నవారు ఉపశమనం కోసం నిమ్మకాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. నిమ్మకాయ నీటిని ఒక గ్లాసులో తీసుకుని అందులో ఉప్పు కలుపుకుని తాగితే గ్యాస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

అరటిపండు :

అరటి పండులో ఉండే కాల్షియం, ఐరన్ కారణంగా గ్యాస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా అజీర్తి, అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×