Big Battery Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరిగిపోతుంది. కొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరలు, స్టైలిష్ డిజైన్‌లు ఇవన్నీ బ్రాండ్‌ల మధ్య పోటీని మరింత ఆసక్తిగా మారుస్తున్నాయి. తాజాగా చైనా దిగ్గజం Oppo భారత మార్కెట్లో మరో కొత్త హాండ్‌సెట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అదే Oppo K13 5G. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చూసినప్పటి నుంచి టెక్ ప్రియుల హార్ట్ బీట్ వేగంగా పెరుగుతోంది. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ పేజీలో పోస్ట్ చేసిన Oppo K13 5G పవర్‌ఫుల్ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం డిజైన్ వంటి అనేక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
పవర్ అంటే ఇదే
ఒప్పో ఈసారి భారీ బ్యాటరీతో మళ్లీ సీరియస్‌గా వచ్చేస్తుంది. లీక్ అయిన సమాచారం ప్రకారం, Oppo K13 5G లో 7000mAh బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాక్టివ్ లైఫ్‌స్టైల్‌కు ఇది మంచి ఫీచర్. ఒకసారి ఛార్జ్ చేస్తే, పూర్తిగా రోజు మరిచిపోయేంతగా యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా ఏదైనా వినియోగించుకోవచ్చు.
Read Also: Flat Buying Mistakes: ఫ్లాట్ కొంటున్నారా జాగ్రత్త..పొరపాటున ..
80W ఫాస్ట్ ఛార్జింగ్
చాలా పెద్ద బ్యాటరీ అంటే చాలాసేపు ఛార్జ్ అవుతుందని అనుకుంటున్నారా? కానే కాదు. Oppo K13 5G లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండబోతోందట. అంటే కేవలం కొద్ది నిమిషాల్లోనే చాలాసేపు పని చేసే పవర్ అందించేస్తుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, ట్రావెలర్స్ వంటి వేగమైన జీవితంతో ఉన్నవారికి పెద్ద ప్లస్ పాయింట్.
డిస్‌ప్లే కూడా రిచ్ & రియల్
ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే ఉండబోతుందని తెలుస్తోంది. 120Hz Refresh Rate వల్ల స్క్రోల్లింగ్, గేమింగ్, వీడియో ప్లేబ్యాక్ మరింత స్మూత్‌గా అనిపించనుంది. వేగంగా స్పందించే UIకి ఇది పెద్ద ప్లస్. అలాగే AMOLED ప్యానెల్ కావడంతో డీప్ బ్లాక్‌లు, కలర్స్ అందుబాటులోకి వస్తాయి.
భద్రత, స్టైల్ రెండూ
Display Fingerprint Sensor కూడా ఇందులో ఉండబోతోందట. ఇది ఫోన్‌ను స్టైలిష్‌గా కూడా మారుస్తుంది. ప్రమాదాల పట్ల తట్టుకునేలా IP69 రేటింగ్ ఉండనుందన్న వార్తలు టెక్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంటే నీరు, ధూళి నుంచి పరికరం రక్షణ పొందుతుంది. వీటితో పాటు IR Blaster కూడా ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్‌గా మార్చేస్తుంది.
చిప్‌సెట్
ఈ ఫోన్ మినిమం Dimensity 8400 ప్రాసెసర్ ద్వారా రానుందన్న గాసిప్స్ ఉన్నాయ్. ఇది మీడియాటెక్ నుంచి వచ్చిన శక్తివంతమైన చిప్‌సెట్. ఈ చిప్‌తో ఒప్పో K13 5G గేమింగ్, మల్టీటాస్కింగ్, స్ట్రీమింగ్ వంటి పనులను సాఫీగా చేయగలదు. ఇదే ప్రాసెసర్ Oppo K12లోని Snapdragon 7 Gen 3కి ఒక అప్‌గ్రేడ్ వేరియంట్ లాగా భావించవచ్చు.
డ్యూయల్ కెమెరాలతో క్లియర్ షాట్స్
ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం కూడా Oppo ఈసారి ఫీచర్ల పరంగా జాగ్రత్త తీసుకుంది. లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉండబోతుంది. దీంతోపాటు 2MP సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. ముందు భాగాన 16MP సెల్ఫీ కెమెరా ఉండనుందని సమాచారం. వీడియో కాల్స్, సెల్ఫీలు తీయడంలో ఇది మంచి అనుభవాన్ని ఇస్తుంది.
లాంచ్ డేట్ & ధర
ఇంకా కంపెనీ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. కానీ టెక్ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాల ప్రకారం, ఈ ఫోన్ ఏప్రిల్ 24న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర విషయంలో కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఈ ఫోన్ రూ.20,000 లోపలే లభించవచ్చు. ఇది నిజమైతే, మిడ్-రేంజ్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది గేమ్-చేంజర్ అవుతుంది. Oppo K13 5G ప్రత్యేకంగా Flipkart ద్వారా మాత్రమే కొనుగోలు చేయగలిగేలా ఉండనుందని తెలుస్తోంది.