Priyanka jain: బుల్లితెర సీరియల్ నటి ప్రియాంక జైన్.. తన అందం, అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కు దగ్గర అయింది. ఆమె నవ్వు, ఆమె మాట తీరుతో బిగ్ బాస్ సీజన్ 7లో టాప్5 లో నిలబెట్టాయి. మౌనరాగం, జానకి కలగనలేదు, ఈ రెండు సీరియల్స్ ప్రియాంకను బుల్లితెర హీరోయిన్ ని చేశాయి. నిజజీవితంలోను ఎంతో సరదాగా ఉంటుంది ప్రియాంక. 2018లో ‘చెల్తేచల్తే’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. జానకి కలగనలేదు తర్వాత ప్రియాంక తెలుగులో ఎటువంటి సీరియల్ లో నటించలేదు. బుల్లితెర నటుడు శివకుమార్ ను ప్రేమిస్తున్నట్లుగా అందరికీ పరిచయం చేసింది. తన యూట్యూబ్ ఛానల్లో తన ప్రియుడితో కలిసి ఫ్రాంక్ వీడియోలు చేసి వాటిని అభిమానులతో పంచుకుంటుంది. ప్రియాంక, శివకుమార్ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తరువాత కొంతమందికి కలిసి వస్తుంది. కొంత మందికి కలిసి రాదు. ప్రియాంకకి బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఒక్క ఆఫర్ కూడా చేతిలోకి రాలేదు. ఈ అమ్మడు తన ప్రియుడు శివకుమార్ తో కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా అమ్మడి ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలు చూదాం ..
సన్నీ సీరియస్ ..
ప్రియాంక శివకుమార్, సన్నీ కలిసి ఒక వీడియో చేసారు. అందులో భాగంగా వారందరు ఒక రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ నూడిల్స్ తింటూ ఉంటారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు కథంతా.. అమ్మడు తన ప్రియుడితో కలిసి నూడిల్స్ లో ఒక పీస్ ని, ఇద్దరు కలిసి తింటూ వుంటారు. అక్కడే ఉన్న సన్నీ అది చూసి నేను సింగిల్ గా ఇక్కడ ఉంటే మీరిద్దరూ రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్నారా అని.. వారు తింటున్నా నూడిల్స్ ని బ్రేక్ చేస్తాడు. వారిద్దరిని చూస్తూ ఇలా తయారయ్యారు ఏంటి అని సన్నీ పక్కకు వెళ్లిపోతాడు. ప్రియాంక, శివకుమార్ ఇద్దరూ ఏమీ అర్థం కానట్లు చూస్తారు. ఇప్పుడు ఈ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. ఈ వీడియో చూసిన వారంతా పాపం సన్నీ సింగిల్ కదా, తన ముందు మీరిద్దరూ ఇలా ఉండడం ఏంటి అని, సన్నీ కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు..
మారిన ప్రియాంక ..
ప్రియాంక సీరియల్స్ లో నటించేటప్పుడు అచ్చ తెలుగు హీరోయిన్ లా ఉండేది. ఇప్పుడు చూస్తే, అసలు మనం చూసింది ప్రియాంకనేనా అనిపిస్తుంది. ఈ భామ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రియుడితో కలిసి వీడియోస్ పెడుతూ, కాలక్షేపం చేస్తుంది. ఇది అందరికీ నచ్చకపోయినా ఆ వీడియోస్ ని ఇష్టపడే వారు ఉన్నారు. ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కామెంట్స్ పెట్టేవారు ఉన్నారు. ఏది ఏమైనా ప్రియాంకని ఇష్టపడేవారు, ఆమె వీడియోస్ కి సపోర్ట్ చేసేవారు, సీరియల్స్ లోకి రావాలని కోరుకునే వారు ఉన్నారు. అభిమానుల కోరిక ప్రకారం, త్వరలో తెలుగు సీరియల్ లో మంచి ఆఫర్ రావాలని మనము కోరుకుందాం..
Also read: Mangalavaram 2 : హర్రర్ తో పాటు మరో ప్రయోగం… ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే