E-Paper
Advertisement

జానీ మాస్టర్ అవుట్.. సందీప్ ఇన్!

జానీ మాస్టర్ అవుట్.. సందీప్ ఇన్!
Advertisement

Tollywood: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ డ్యాన్సర్ అసోసియేషన్ లో చోటు చేసుకున్న వివాదం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్మాతల సంఘం ఫిలిం ఫెడరేషన్ రంగంలోకి దిగినప్పటికీ.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరు మార్చుకోకపోవడంతో ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ ఆమెపై మండిపడుతూ.. ఒక సుదీర్ఘ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. నిజానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna ) లాంటి సినీ పెద్దలు రంగంలోకి దిగి ఈ సమస్యకు పరిష్కారం చూపించారు. గత ఆదివారం డ్యాన్సర్ అసోసియేషన్లో ఏర్పడ్డ వివాదానికి పరిష్కారం లభించింది. ఇకపై అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, జానీ మాస్టర్ కూడా ప్రకటించారు.

అసలు సుమలత టార్గెట్ ఏంటి?

అయితే ఇప్పుడు మళ్లీ సుమలత చేసిన పనికి ఫిలిం ఫెడరేషన్ మండిపడుతోంది. నిజానికి ఉన్నది రెండే దారులు.. ఒకటి సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ మండిపడుతూ డ్యాన్సర్ అసోసియేషన్ కి రాజీనామా చేసిన 10 మంది సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్లడం.. లేదా మళ్లీ మొత్తం ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం.. అయితే సుమలత మాత్రం మిగతా డ్యాన్సర్లను ఉప ఎన్నికలు జరిపించేలా ప్రోత్సహిస్తోంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ది ప్యారడైజ్ కోసమే నటించారా?

Advertisement

నిజానికి వీరు గత ఆదివారం డ్యాన్సర్ అసోసియేషన్ లో రాజీనామా చేసిన 10 మంది సభ్యులతో కలుపుకుపోతామని చెప్పడానికి కారణం నాని (Nani) ‘ది ప్యారడైజ్’ సినిమా అని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటకు జానీ మాస్టర్ కంపోజ్ చేయాల్సి ఉంది .పది రోజులు రిహార్సల్ కూడా చేశారు. అయితే జానీ మాస్టర్, సుమలత తీరును గమనించిన ఫిలిం ఫెడరేషన్ చిత్ర బృందంతో చెప్పి జానీ మాస్టర్ ను తీయించి , ఆ స్థానంలో ఆట సందీప్ (Aata Sandeep) తో కంపోజ్ చేయించినట్లు సమాచారం. మొత్తానికైతే జానీ మాస్టర్ ఈ సినిమా కోసమే ఫిలిం ఫెడరేషన్ లో సర్దుకుపోతున్నట్లు చెప్పాడని, అయినా వారి తీరు మారలేదని ఫిలిం ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కూడా ది ప్యారడైజ్ చిత్రం కోసం మాత్రమే వీరు నటించారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

also read:ఓటీటీలోకి రాబోతున్న ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

సుమలత తీరు మార్చుకోకపోతే.. చర్యలు తప్పవా?

Advertisement

ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ ఒక లేఖ కూడా విడుదల చేసింది.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి సినీ పెద్దలు కూడా రంగంలోకి దిగి సర్దుకుపోవాలి అని సూచించినా.. ది ప్యారడైజ్ సినిమా కోసమే వీరు అప్పటికప్పుడు తగ్గుతున్నట్లు చెప్పి.. మళ్లీ వెనకుండి కథను నడిపిస్తున్నారు అంటూ ఫైర్ అయింది. సినీ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందాలను ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా.. అధికార దుర్వినియోగంతో సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. తన తీరును మార్చుకోకపోతే ఫెడరేషన్ కౌన్సిల్ లో మీటింగ్ పెట్టి మెజారిటీ డ్యాన్సర్ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని.. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తాము అని స్పష్టం చేసింది. అంతేకాదు మిగతా అసోసియేషన్ డ్యాన్సర్స్ కూడా వీరిపై మండిపడుతూ .. పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న జానీ మాస్టర్, అతని భార్య సుమలత ఏకపక్ష నిర్ణయాలు ఇక్కడ చెల్లవు అంటూ తెలిపారు. మొత్తానికి అయితే సినీ పెద్దలు రంగంలోకి దిగినప్పటికీ కూడా వీరు వారి మాటలను పెడచెవిన పెట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది

Related News

అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!

కాబోయే భర్తను పరిచయం చేసిన ‘గద్దల కొండ గణేష్’ మూవీ హీరోయిన్!

కూతుళ్లు చెప్పినా వినకుండా రూ.26 కోట్లు నష్టపోయిన నిర్మాత?

డ్యాన్సర్ అసోసియేషన్లో మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫెడరేషన్ మండిపాటు!

పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించిన పూజా హెగ్డే.. వరుడు ఎవరంటే?

‘అబద్ధమేవ జయతే’ పాటను విడుదల చేసిన దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ..

బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి చూడాల్సిన టాప్ తెలుగు సినిమాలు

Big Stories

Advertisement
×