Big Stories

Minister Seethakka on Modi: ఓవరాక్షన్ చేయొద్దు: మంత్రి సీతక్క వార్నింగ్..!

Minister Seethakka Comments on PM Modi: పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రధాని మోదీ సపోర్ట్ చేస్తున్నారు, కానీ పేద ప్రజలను పట్టించుకోవట్లేదని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కొమురం భీం జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.

- Advertisement -

తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఏనాడు కూడా ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధిక సీట్లు సాధిస్తుందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ముందే గమనించిన బీజేపీ, బీఆర్ఎస్ తట్టుకోలేకనే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాయన్నారు.

- Advertisement -

నిర్మల్ లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలోని ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ప్రధాని మోదీ సపోర్ట్ చేస్తున్నారు.. కానీ, బడుగు, బలహీన వర్గాలను మాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చి పేద ప్రజలను మరింత పేదలుగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆమె అన్నారు.

Also Read: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త!

అదేవిధంగా, రాష్ట్రంలో కొన్ని చోట్లా కొందరు మిల్లర్ల యాజమాన్యాలు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అలా ఓవరాక్షన్ చేయొద్దని ఆమె సూచించినట్లు తెలుస్తోంది. ఏదైనా సరే కొనుగోలు కేంద్రం దగ్గరనే మాట్లాడాలి.. కానీ, లారీలలో ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరకు తీసుకెల్లి కటింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశించారని ఆమె అన్నారని తెలుస్తోంది. అకాల వర్షానికి ధాన్యం తడిచినా పూర్తి మద్దతు ధర చెల్లిస్తామని ఆమె తెలిపినట్లు సమాచారం.

కాగా, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణ విజయం కోసం మంత్రి సీతక్క తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ టీచర్ గా పని చేసిన ఆత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ ఎంపీ బరిలో నిల్చోబెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News