BigTV English

Vijay Devarakonda’s 14th Movie: చారిత్రాత్మక కథతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. పోస్టర్ వచ్చేసింది!

Vijay Devarakonda’s 14th Movie: చారిత్రాత్మక కథతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. పోస్టర్ వచ్చేసింది!

Vijay Devarakonda Movie Coming With Periodic Drama and Special Poster Released: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూసతున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ రోజు విజయ్ బర్త్ డే కావడంతో వరుస సినిమాలు అనౌన్స్ అవుతున్నాయి. ఈ మేరకు టాక్సీవాలా, శామ్ సింగరాయ్ మూవీలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌తో ఓ మూవీ చేస్తున్నాడు.


ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లో 14వ మూవీగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ అందించారు. మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో ఓ యుద్ధ వీరుడి విగ్రహం ఉంది. అంతేకాకుండా ఆ పోస్టర్‌లో 1854 నుంచి 1878 సంవత్సరం మధ్యలో అని ఉంది. దీని బట్టి చూస్తే ఈ మూవీ ఆ కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ పోస్టర్ రిలీజ్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇంతవరకు క్లాస్, మాస్ సినిమాలతో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించిన విజయ్ దేవరకొండ.. ఈ సారి చారిత్రాత్మక కథతో వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ పోస్టర్ ఇలా ఉంటే.. ఇందులో విజయ్ ఎలాంటి లుక్‌లో ఉంటాడో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Also Read: కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. విజయ్ దేవరకొండ కొత్త మూవీ పోస్టర్ అదుర్స్

పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. మరి ఈ సినిమా అయినా విజయ్ దేవరకొండకు మంచి కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ మూవీతో పాటు మరొక సినిమా అప్డేట్ కూడా వచ్చింది. ‘రాజా వారు రాణి గారు’ సినిమా ఫేం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

Also Read: Chiranjeevi: పిఠాపురం నేను రావడం లేదు.. పవన్ నన్ను పిలవలేదు

కాగా ఇటీవల విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం తన హవా చూపించలేక పోయింది. రొటీన్ స్టోరీ, క్యారెక్టర్లతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని యూత్ రిజెక్ట్ చేశారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఫిదా అయిపోయారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×