E-Paper
Advertisement

ఫిలిప్స్ Vs హయర్ ఎయిర్ ఫ్రైయర్స్..ఇండియన్ వంటలకు ఏది బెస్ట్?

ఫిలిప్స్ Vs హయర్ ఎయిర్ ఫ్రైయర్స్..ఇండియన్ వంటలకు ఏది బెస్ట్?
Advertisement

Philips vs Haier air fryer:  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే ఆలోచన పెరిగిన తర్వాత ప్రతి ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఒక ముఖ్యమైన గ్యాడ్జెట్‌గా మారిపోయింది. నూనె చుక్క లేకుండా.. డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మార్కెట్లో రకరకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటంతో ఏది కొనాలో అర్థం కాక చాలామంది సతమతమవుతుంటారు. ముఖ్యంగా మన ఇండియన్ వంటకాలకు ఫిలిప్స్ , హయర్ ఎయిర్ ఫ్రైయర్లలో ఏది బెస్ట్ అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.ఈ రెండింటిలో ఇండియన్ వంటకాల తయారీకి ఏది అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం .

రెండిట్లో ఏది బెస్ట్ ?

1.ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్:

Advertisement

ఎయిర్ ఫ్రైయర్ మార్కెట్లో ఫిలిప్స్ ఒక మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు. దీనిలో ఉండే ప్రత్యేకమైన ‘రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ’ ఆహారాన్ని అన్ని వైపులా సమానంగా వేడి చేస్తుంది.

ఇండియన్ కుకింగ్: సమోసాలు, ఆలూ టిక్కీ, తందూరి చికెన్ వంటి వంటకాలను ఇది చాలా తక్కువ సమయంలో, బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా మారుస్తుంది. దీని ద్వారా బేకరీలో దొరికే స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Advertisement

నాణ్యత: దీని తయారీలో వాడే మెటీరియల్ చాలా క్వాలిటీతో ఉంటుంది. కాబట్టి క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. అంతే కాకుండా లుక్ కూడా చాలా బాగుంటుంది.

బ్రాండ్ ట్రస్ట్: కస్టమర్ల నమ్మకం విషయంలో ఫిలిప్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొద్దిగా ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇచ్చే  రిజల్ట్ మాత్రం అదుర్స్ అనిపిస్తుంది.

2. హయర్ ఎయిర్ ఫ్రైయర్: 

హయర్ బ్రాండ్ ఇటీవలి కాలంలో లేటెస్ట్ ఫీచర్లు, తక్కువ ధరలతో మార్కెట్‌ను షేక్ చేస్తోంది.

స్మార్ట్ ఆప్షన్స్: డిజిటల్ టచ్ ప్యానెల్, ప్రీ-సెట్ కుకింగ్ మెనూలు మహిళలకు వంట పనిని మరింత ఈజీ చేస్తాయి.

కెపాసిటీ, ధర: ఫిలిప్స్‌తో పోలిస్తే.. హయర్ ఎయిర్ ఫ్రైయర్లు కాస్త తక్కువ బడ్జెట్‌ లో ఎక్కువ కెపాసిటీని అందిస్తాయి. పెద్ద కుటుంబాలకు ఇది చాలా చక్కటి ఆప్షన్. ఎక్కువ మంది కోసం స్నాక్స్ చేయడానికి ఇది ఫర్ఫెక్ట్ గా ఉంటుంది.

పర్ఫార్మెన్స్: రోస్టింగ్, బేకింగ్, గ్రిల్లింగ్ చేయడంలో హయర్ పని తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నూనె వాడకం చాలా వరకు తగ్గిపోతుంది. ఫలితంగా హెల్తీ ఫుడ్ తయారు చేసుకుని తినొచ్చు.

ఏది కొంటే బెటర్?

మీ వంటగది అవసరాలను బట్టి సరైన దాన్ని ఎంచుకోవాలి. మీరు బ్రాండ్ వాల్యూ, పర్ఫెక్ట్ టెక్నాలజీ కోరుకుంటే ఫిలిప్స్  బెస్ట్. అలా కాకుండా, తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్ డిజిటల్ ఫీచర్లు, ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే.. మాత్రం హయర్ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.

ఆరోగ్యకరం అయిన లైఫ్ స్టైల్ కోసం ఎయిర్ ఫ్రైయర్ కొనడం చాలా మంచి నిర్ణయం. ఫిలిప్స్, హయర్ రెండూ మంచి పని తీరును కనబరుస్తాయి. మీ బడ్జెట్ , కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తగిన మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా ఆరో గ్యకరమైన, రుచికరమైన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×