Tanveer Ahmed reaction on Devdutt Padikkal: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Team India vs. Sri Lanka) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (India tour of Sri Lanka 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా అద్భుతంగా రాణించి మొదటి ఇన్నింగ్స్ లో 462 పరుగులు సాధించి ఆల్ అవుట్ అయింది. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal) 167 పరుగులు చేసి ఇరగదీశాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు 15 బౌండరీలు ఉన్నాయి. దీంతో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేయగలిగింది.
శ్రీలంకపై దేవ్ దత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో కూడా ఫ్లాట్ మైదానాలు టీమ్ ఇండియా కోసం తయారు చేశారని బాంబు పేల్చారు. అందుకే టీమ్ ఇండియా చాలా పటిష్టంగా ఆడుతోందని ఆగ్రహ ఆవేశాలతో రెచ్చిపోయారు. అంతేకాదు దేవ్ దత్ పడిక్కల్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు శ్రీలంక బౌలర్లు స్లోగా బంతులు సంధించారని ఆరోపణలు చేశారు. లేకపోతే అతడు ఇందులో సెంచరీ చేసేవాడు కాదని హేళన చేశారు. టి20 క్రికెటర్ దేవ్ దత్ పడిక్కల్ టెస్టుల్లో ఆడడం కష్టమేనని పేర్కొన్నారు. దీనంతటి వెనుక కుట్ర కోణం ఉంది కాబట్టే… అద్భుతంగా రాణించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంటనే ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ( WTC) టీం ఇండియాను పంపేలా కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో టీమిండియాను నిలిపేందుకు కావాలనే శ్రీలంక ఓడిపోతుందని బాంబు పేల్చారు. దానికి తగ్గట్టుగానే శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా సహకరిస్తాందని ఆరోపణలు చేశారు.
శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా పోరాటం చేస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో.. శ్రీలంక పై డూ ఆర్ డై కి సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ సందర్భంగా 462 పరుగులకు ఆల్ అవుట్ అయింది టీమ్ ఇండియా. ప్రస్తుతం శ్రీలంక బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే 7 వికెట్లు నష్టపోయిన శ్రీలంక 244 పరుగులు సాధించింది. మరో 218 పరుగులు వెనుకబడి ఉంది. ఇవాళ మూడో రోజు మాత్రమే. ఇవాళ సాయంత్రం లోపు శ్రీలంకను ఆల్ అవుట్ చేసి.. టీమిండియా రేపు బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. లేకపోతే డ్రా కాక తప్పదు.