Phonepe Google Pay Free Mobile Recharge| ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ రీఛార్జ్‌ల కోసం Google Pay, PhonePe లేదా ఇతర UPI వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా రీఛార్జ్ చేసేటప్పుడు సాధారణంగా రూ.3 అదనపు ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. అయితే, రూ.50 కంటే తక్కువ మొత్తానికి రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఈ అదనపు ఛార్జీలు వర్తించవు. ఈ వివరాలు చాలా మందికి తెలియవు. అందుకే అదనపు ఛార్జీలు చెల్లించకుండా ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చో తెలుసుకోండి. మీ జియో లేదా ఎయిర్‌టెల్ సిమ్‌ను అదనపు ఛార్జీలు లేకుండా ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం.
డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా రీఛార్జ్
భారతదేశంలో గూగుల్ పే, ఫోన్ పే (Google Pay, PhonePe) అత్యంత ప్రాచుర్యం పొందిన డిజిటల్ పేమెంట్ యాప్‌లు. వినియోగదారులు తమ యుటిలిటీ బిల్లులు (కరెంటు బిల్లులు, వంట గ్యాస్ బిల్లు, ఇంటి పన్ను, నీటి పన్ను), ఇతర ఆన్‌లైన్ లావాదేవీలను సులభంగా నిర్వహించడానికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, ఈ పేమెంట్ యాప్‌లు మొబైల్ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షించేవి. కానీ ఇటీవలి కాలంలో, ఇవి బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌లు, ఇతర సేవలకు అధిక రుసుములు విధిస్తున్నాయి. ఈ రుసుములలో GST కూడా చేర్చబడుతుంది.
ప్లాట్ ఫామ్ ఫీజు లేకుండానే మొబైల్ రీచార్జ్
మీ ఫోన్ లో ముందుగా ప్లే స్టోర్‌ను తెరవండి. మీకు జియో సిమ్ ఉంటే “మైజియో” యాప్‌ను లేదా ఎయిర్‌టెల్ సిమ్ ఉంటే “ఎయిర్‌టెల్ థాంక్స్” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్‌లో మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత, రీఛార్జ్ ప్లాన్ ను ఎంపిక చేసుకోండి
అందుబాటులో ఉన్న ప్లాన్‌ల నుండి మీకు కావలసినదాన్ని ఎంచుకుని, రీఛార్జ్ బటన్‌పై క్లిక్ చేయండి. తర్వాత చెల్లింపు పేజీకి నావిగేట్ అవుతుంది.
చెల్లింపు పద్ధతుల్లో “UPI ID” ఎంపికను ఎంచుకుని, మీ UPI ID ని నమోదు చేయండి. లేదా యుపిఐ పేమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీ ఫోన్ పే లేదా గూగుల్ పే యాప్ కు నావిగేషన్ అవుతుంది. ఉదాహరణకు ఫోన్ పే తెరిచి రీచార్జ్ పూర్తి చేయండి.
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఏదైనా అదనపు ఛార్జీలు లేకుండానే రీఛార్జ్‌ను పూర్తి అవుతుంది.
మీరు నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ ఎంపికను కూడా ఉపయోగించవచ్చు. మీకు సౌకర్యవంతమైన చెల్లింపు మార్గాన్ని ఎంచుకుని ప్రక్రియను పూర్తి చేయండి.
Also Read: యవ్వనం కోసం ప్రయత్నిస్తే ముసలితనం.. బెడిసి కొట్టిన ప్రయోగం!
అదనపు టిప్స్
కొన్ని డిజిటల్ వాలెట్‌లు జియో రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌లు లేదా డిస్కౌంట్‌లను అందిస్తాయి. మీరు Paytm లేదా Amazon Pay వంటి వాలెట్‌లలోని ఆఫర్‌ల విభాగాన్ని పరిశీలించవచ్చు.
జియో వినియోగదారులు జియో యొక్క అధికారిక వెబ్‌సైట్ (jio.com) ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మార్గంలో కూడా అదనపు ఛార్జీలు వర్తించవు.
ఈ సులభమైన మార్గాలను అనుసరించడం ద్వారా మీరు అనవసరమైన అదనపు ఛార్జీలను తగ్గించవచ్చు లేదా పూర్తిగా తప్పించుకోవచ్చు.