Private vs Public Sector: ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. అయితే డివిడెండ్ పరంగా ఎవరు ముందున్నారో తెలుసా మీకు. ప్రైవేట్ కంపెనీలు? లేక ప్రభుత్వ రంగ సంస్థలు? ఈ ప్రశ్నకు తాజా సమాధానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పెట్టుబడి, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM) కార్యదర్శి అరుణిష్ చావ్లా ప్రకటన మేరకు, CPSUలు (Central Public Sector Undertakings) సామాన్యుల కోసం పెట్టుబడులపై స్పష్టమైన దిశను చూపిస్తున్నాయంటూ కొనియాడారు.
ఇన్వెస్టర్లకు ప్రయోజనం
ఈ వ్యాఖ్యలు ఖాళీ గాలి మాటలు కాదు. దీని వెనుక solid నంబర్లు కూడా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25), CPSUలు ఏకంగా రూ.1.5 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించాయి. ఇందులో రూ.74,017 కోట్లు నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాయి. అంటే, ప్రభుత్వ సంస్థలు డివిడెండ్లు ఇవ్వడంలో కేవలం ప్రభుత్వానికే కాదు, సాధారణ మైనారిటీ ఇన్వెస్టర్లకూ ప్రయోజనం కలుగుతున్నాయి.
డివిడెండ్ అంటే ఏంటి?
ఒక కంపెనీ లాభాల్లో వాటాదారులకు ఇచ్చే వాటాను డివిడెండ్ అంటారు. ఇవి కంపెనీ లాభాలపై రాబడిగా వస్తాయి. మీరు లాభాలపై భాగం తీసుకుంటారు. మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే, ఒక దశలో మీకు డివిడెండ్ రావొచ్చు. అయితే ప్రతి కంపెనీ దీనిని ఇస్తుందా? అంటే ఇవ్వదు. కొన్ని కంపెనీలు వాటి లాభాలను మళ్లీ వ్యాపార విస్తరణకు వాడతాయి. కొన్ని మాత్రం వాటాదారులపై కూడా దృష్టి పెడతాయి.
ప్రైవేట్ కంపెనీలకు సందేశం
పారదర్శకతకు మార్గం CPSUలని అరుణిష్ చావ్లా అన్నారు. ఈ వ్యాఖ్యల్లో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలూ కూడా ఇదే CPSUల బాటను అనుసరించాలన్నారు. ఎందుకంటే ఇవి డివిడెండ్లు ఇవ్వడంలో సమయపాలన, పారదర్శకత పాటించి నియమిత రాబడిని అందిస్తే వాటాదారులకు కూడా మేలు జరుగుతుందన్నారు.
Read Also: Flat Buying Mistakes: ఫ్లాట్ కొంటున్నారా జాగ్రత్త..పొరపాటున …
PSU స్టాక్‌లను ఎందుకు ఎంపిక చేయాలి?
మీరు మదుపరు అయితే, PSUల స్టాక్స్‌ను ఎందుకు ఎంపిక చేసుకోవాలని ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు బలమైన విధానాలతో ముందడుగు వేస్తున్నాయి. వీటిని తక్కువ ప్రమాదం, స్థిర ఆదాయం కలిగిన పెట్టుబడిగా పరిగణించవచ్చు. డివిడెండ్ గ్యారంటీ – వీటికి లాభాల మీద ఆధారపడే ఓ ఆదాయ మార్గం ఉంటుంది. ప్రభుత్వ పర్యవేక్షణతో నిర్వహణ పారదర్శకంగా ఉంటుంది.
ఫండ్ మేనేజర్లకు సూచన
చావ్లా గారు మరో కీలకమైన సూచన చేశారు. ఫండ్ మేనేజర్లు తమ క్లయింట్లకు రూపొందించే పోర్ట్‌ఫోలియోల్లో PSU స్టాక్స్‌ను చేర్చాలన్నారు. ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు స్థిర ఆదాయం అందిస్తుంది. దీంతోపాటు రిటైల్ ఇన్వెస్టర్లకు నమ్మకమైన పెట్టుబడిని ఇస్తుంది. మొదటిసారి పెట్టుబడి చేసే వారికి తక్కువ రిస్క్‌తో పెట్టుబడి ప్రారంభించేందుకు, ఉపయోగపడుతుంది.
ఈ సంస్థలు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరం 2024-25లో CPSU రూ.1.5 లక్షల కోట్ల రికార్డు డివిడెండ్‌ను అందించింది. ఇందులో రూ.74,017 కోట్లు CPSUలు ప్రభుత్వానికి ఇచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, CPSU రూ.1.23 కోట్ల డివిడెండ్ చెల్లించింది. సామాన్యులకు డివిడెండ్లు ఇవ్వడంలో CPSUలు ప్రైవేట్ కంపెనీల కంటే ముందున్నాయి.