Poco X7 : ఈ కొత్త సంవత్సరం సందర్భంగా, చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ పోకో నుంచి X7 సిరీస్ (Poco X7 Series) విడుదల కానుంది. జనవరి 9న మార్కెట్లోకి లాంఛ్ కానుంది. అది కూడా రూ.30 వేల కన్నా తక్కువ ధరకే Poco X7 ప్రో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్, పవర్ఫుల్ కెమెరాతో రానుండగా, Poco X7 కూడా దాదాపుగా ఇదే ఫీచర్స్‌తో పాటు మోడెస్ట్ ప్రాసెసర్‌తో రానుందని తెలుస్తోంది. ఇప్పుడీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి మంచి పోటీనిస్తాయని టెక్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు లీక్ అయ్యాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తున్న చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో.. తాజాగా మరో కొత్త సిరీస్ ను లాంఛ్ చేయనున్న సంగతి తెలిసిందే. మరి అదిరిపోయే ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్ తో వచ్చేస్తున్న ఈ మొబైల్ డీటెయిల్స్ పై మీరు లుక్ వేసేయండి.
Poco X7 Pro Features –
Poco X7 ప్రో.. 120 Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో రానుందట. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో రానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 4nm ప్రాసెస్ ఆధారంగా నడిచే Media Tek డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌తో నడుస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Mali G720 MC6 GPUతో పెయిర్ చేశారంట. ఈ ఫోన్ 8GB / 12GB LPDDR4X RAM, 256GB / 512GB స్టోరేజ్‌తో రెండు వేరియంట్‌లలో వస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆప్టిక్స్ విషయానికొస్తే, ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయెల్ కెమెరా సెన్సార్‌తో రానుందట. OIS, EIS కలగలిపిన 50 MP ప్రైమరీ షూటర్, 8 MP అల్ట్రా – వైడ్ యాంగిల్ లెన్స్ అమర్చారట. ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 20 MP షూటర్ ఉండవచ్చని తెలిసింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌గా 6,000mAh బ్యాటరీతో రానుందట.
Poco X7 Features –
Poco X7 కూడా 6.67 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందట. కానీ కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటక్షన్ మాత్రమే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే, 50 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా-వైడ్, 2 MP మాక్రో లెన్స్‌తో రానుందట. ఫ్రంట్ సైడ్‌లో 20 MP సెల్ఫీ షూటర్ ఉండవచ్చని తెలిసింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5110 mAh బ్యాటరీతో రానుందట.
మొత్తంగా ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లు(X7 ప్రో, X7) ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Xiaomi లేటెస్ట్ HyperOS 2.0పై రన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంటాయట.
ALSO READ : HP కొత్త ల్యాప్టాప్స్ వచ్చేశాయ్ భయ్యా! AI ఫీచర్స్ తో పాటు అదిరే ప్రాసెసర్ తో!