Clarke on Virat Kohli: 2021 సంవత్సరం చివరలో భారత జట్టుకు కెప్టెన్సీ అస్థిరత ఏర్పడింది. టి-20 ఫార్మాట్ లో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. వన్డే, టెస్టులకు కెప్టెన్ గా కొనసాగాలని అనుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదని భావించిన బీసీసీఐ.. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించింది. దీంతో అసంతృప్తి చెందిన విరాట్ 2022 జనవరిలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు.
Also Read: Shubman Gill: రూ.450 కోట్ల స్కాం.. గిల్ తో పాటు మరో నలుగురికి CID నోటీసులు !
భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలిగాడు. దీంతో రోహిత్ శర్మ కి పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ. అయితే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల కారణంగా రాణించలేకపోతున్నాడు. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో కూడా రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 లో కూడా రాణించలేకపోతున్నాడు రోహిత్.
10.93 సగటుతో గత 15 ఇన్నింగ్స్ లలో కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో కూడా ఇప్పటివరకు కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ టెస్టుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేపటినుండి సిడ్నీ వేదికగా జరిగే ఐదవ టెస్టులో రోహిత్ ఆడతాడా..? లేదా..? అనేది కూడా సందేహంగా మారింది.
అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్ భారత టెస్ట్ కెప్టెన్సీ ని వదులుకునే అవకాశం ఉందని.. రిటైర్మెంట్ మాత్రం ఇప్పుడే ప్రకటించకపోవచ్చు అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటే తిరిగి మళ్ళీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రోహిత్ తో పోలిస్తే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ లో కాస్త మెరుగ్గా ఉన్నాడు.
ఆఫ్ సైడ్ బంతిని ఆడే బలహీనతను వదిలేస్తే కోహ్లీ మరికొంత కాలం జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు. టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ 68 మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించాడు. ఇందులో 17 మ్యాచ్ లు ఓడిపోగా.. 40 విజయాలు సాధించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విజయాల శాతం 58.82 గా ఉంది. మరి విరాట్ తిరిగి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి. ఇక మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ కాన్ స్టాస్ – విరాట్ కోహ్లీ మధ్య చిన్న వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
Also Read: Jay shah Kavya Maran: కావ్యా పాపతో ICC బాస్ రొమాన్స్.. ఫోటోలు వైరల్ !
దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అతడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడి మీడియా కూడా కోహ్లీపై తీవ్ర విమర్శలు చేసింది. కానీ ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాత్రం కోహ్లీని వెనకేసుకొచ్చాడు. కోహ్లీ గురించి తనకు బాగా తెలుసు అని.. మ్యాచ్ ముగిశాక అతడు కాన్ స్టాస్ తో మాట్లాడాడని తెలిపాడు. అందుకే కోహ్లీ గొప్పవాడని చెబుతానన్నాడు. అందరూ అంటున్నట్లుగా కోహ్లీ దారుణమైన వ్యక్తి కాదని.. బూమ్రా బౌలింగ్ లో అతడు రివర్స్ షాట్లను కొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ అత్యుత్తమ బౌలర్ ని గౌరవించలేదనే ఉద్దేశంతో కోహ్లీ అలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటాడని చెప్పుకొచ్చాడు మైఖేల్ క్లార్క్.