Vande Bharat Express trains: కొత్త సంవత్సరం వేళ భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి కొత్త టైమ్ టేబుల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టైమ్ టేబుల్ ప్రకారం పలు వందేభారత్ రైళ్ల టైమింగ్స్ మారాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 136 రైళ్లు ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. వీటిలో టైమింగ్స్ మారిన వందేభారత్ రైళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఈ రైళ్ల వివరాలను తెలుసుకునేందుకు IRCTC వెబ్ సైట్ (www.irctc.co.in) తో పాటు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లలో ఉండే మేనేజర్, ఎంక్వయిరీ కౌంటర్ లో పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు.
పలు వందేభారత్ రైళ్ల టైమింగ్స్ లో మార్పలు
నేషనల్ ట్రాన్స్ పోర్టర్ టెర్మినల్ స్టేషన్లలో నాలుగు సెమీ-హై-స్పీడ్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. వాటిలో డియోఘర్- వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్(22499), పాట్నా-గోమతి నగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్(22345), లక్నో-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్(22545), గోమతి నగర్-పాట్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్(22346) రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే సంస్థ వెల్లడించింది.
⦿ డియోఘర్-వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్
డియోఘర్-వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్(22499) టైమింగ్స్ మార్చినట్లు అధికారులు తెలిపారు. అంతకు ముందు ఈ రైలు రాత్రి 9:55 గంటలకు వారణాసి జంక్షన్ నుంచి బయల్దేరేది. ప్రస్తుతం ఈ రైలు 9:53 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 10.30 గంటలకు గమ్య స్థానానికి చేరుకుంటుంది.
⦿పాట్నా-గోమతి నగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
పాట్నా-గోమతి నగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్(22345) రైలు సమయంలోనూ మార్పులు చేర్పులు చేశారు. అంతకుముందు, రైలు ఉదయం 09:00 గంటలకు న్యూమాల్ జంక్షన్ నుంచి బయల్దేరేది. ప్రస్తుతం ఈ రైలు 09:05 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2:35 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
⦿లక్నో-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
లక్నో-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్(22545) టైమింగ్స్ కూడా మారాయి. ఈ రైలు లక్నో జంక్షన్- డెహ్రాడూన్ సెక్షన్ లో నడుస్తుంది. ఈ రైలు మధ్యాహ్నం 1:35 గంటలకు బదులుగా 1:40 గంటలకు డెహ్రాడూన్ స్టేషన్ కు చేరుకుంటుంది.
⦿గోమతి నగర్-పాట్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్
ML-NEWC సెక్షన్ లో ప్రయాణించే గోమతి నగర్-పాట్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్(22346) రైలు సమయాన్ని కూడా అధికారులు మార్చారు. ఈ రైలు ML-NEWC విభాగంలో రాత్రి 8:35 గంటలకు బదులుగా రాత్రి 8:43 గంటలకు ఆలస్యంగా చేరుకుంటుంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని తెలుసుకుని, ప్రస్తుత సమయానికి అనుగుణంగా స్టేషన్లకు చేరుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం పలు రైళ్లకు సంబంధించి టైమింగ్స్ మార్చినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను భారతీయ రైల్వే సంస్థకు సంబంధించి వెబ్ సైట్ లో చూడాలని సూచించారు.
Read Also: సంక్రాంతి వేళ సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు