BigTV English

Poco F7 Ultra: పోకో F7 Ultra స్మార్ట్ ఫోన్, రేపో మాపో భారత్‌లోకి, ధర కాస్త, ఆపై స్పెషలేంటి?

Poco F7 Ultra: పోకో F7 Ultra స్మార్ట్ ఫోన్, రేపో మాపో భారత్‌లోకి, ధర కాస్త, ఆపై స్పెషలేంటి?

Poco F7 Ultra: బహుళ జాతి కంపెనీలు చైనా తర్వాత ఇండియా వైపు దృష్టి పెట్టాయి. ఎందుకంటే జనాభా పరంగా ఈ రెండు దేశాలదే ఆధిపత్యం కావడంతో ఆయా దేశాల మార్కెట్లపై చాలా కంపెనీలు కన్నేశాయి. ఇప్పుడు చైనా సైతం ఇండియా మార్కెట్‌పై కన్నేసింది. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ మేకర్, షియోమి సబ్ బ్రాండ్ పోకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ చేస్తోంది. దీనికి సంబంధించి పోకో కంపెనీ అధికారకంగా ప్రకటన ఇచ్చేసింది.


రోజురోజుకూ టెక్నాలజీ రావడంతో వినియోగదారులకు ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. యూరప్, అమెరికా దేశాలకు ధీటుగా చైనా రంగంలోకి దిగేసింది. ఒక కంపెనీ ఫోన్ రిలీజ్ చేస్తే.. కొద్దిరోజుల్లో దానికి ధీటుగా అలాంటి స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి దించుతోంది.  ధర సైతం అందుబాటులో ఉండడంతో సామాన్యుడు ఎగబడుతున్నాయి. ఫీచర్స్ సైతం అధికంగా ఉంటున్నాయి కూడా.

టెక్ ప్రియులకు శుభవార్త


Poco F7 Ultra‌  5జీ స్మార్ట్ ఫోన్‌ని అంతర్జాతీయ మార్కెట్లోకి మార్చిలో విడుదల చేసింది.  ఇప్పుడు అదే స్మార్ట్ ఫోన్‌ని భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పోకో ఇండియా సీఈఓ హిమాంషు టాండన్ ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ పెట్టారు. Poco F7 Ultra‌ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్‌లోకి చేస్తున్నామన్నది అందులోని మెయిన్ సారాంశం.

Poco F7 Ultra‌ స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాలు అంటుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో అమోలెడ్ డిస్ ప్లే కలిగివుంది. వెనుక 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 32 మెగా పిక్సెల్ ఉండనుంది. టెలి ఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా కలిగివుంది. ఫోటో 1440 x 3200 పిక్సల్స్ రిజల్యూషన్ ఉంటుంది. గ్లోబల్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది.

ALSO READ: బాలి వచ్చాడు.. ఇంట్లోనే ఫ్యూచర్ టచ్, కొత్త రొబోట్ చూశారా?

పోకో ఎఫ్7 అల్ట్రా ఫీచర్స్

హైపర్ ఓఎస్ 2 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. ఐపీ 68 డస్ట్, వాటర్ రెసిస్టన్స్ కలిగివుంది. వేరియంట్ బట్టి స్టోరేజ్ కెపాసిటీ ఉండనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తోపాటు 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మరొక వేరియంట్‌లో 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ , 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది.

అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోపాటు 5జీ స్మార్ట్ ఫోన్ కూడా. ఇక యూఎస్బీ టైప్ -సీ పోర్ట్, 000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.  120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సాధారణంగా ఉంటుంది. 5,300mAh బ్యాటరీని కలిగివుందన్నమాట. అమెరికాలో Poco F7 Ultra ధర 12GB+256GB మోడల్‌కు $599 (భారత కరెన్సీలో సుమారు రూ. 51,000) ఉంది.

మరొక వేరియంట్ 16GB + 512GBకు అమెరికా ధర $ 649 (సుమారు రూ. 55,000) గా ఉంటుంది. నలుపు, పసుపు రంగులలో మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇండియా మార్కెట్లోకి కలర్స్ ఏమైనా మార్చుతుందా అనేది చూడాలి. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×