BigTV English

Be Alert: కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Be Alert: కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

చాలా మంది ప్రయాణ సమయంలో కారులో వాటర్ బాటిళ్లు క్యారీ చేస్తారు. దాహం వేసినప్పుడల్లా తీసి తాగుతుంటారు. అయితే, వేసవిలో అస్సలు అలా చేయకూడదంటున్నారు నిపుణులు. లేదంటే, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మంచినీళ్లే విషంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ సమ్మర్ లో కారులో ఉంచిన నీళ్లు ఎందుకు తాగకూడదు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


కారులో ఉంచిన నీళ్లను ఎందుకు తాగకూడదంటే?

వేసవిలో కారులో ఉంచిన నీళ్లను ఎట్టి పరిస్థితులలో తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లు మైక్రో ప్లాస్టిక్స్ తో కలిసిపోయి ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయంటున్నారు. సాధారణంగా కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్ల నీళ్లు వేడి వాతావరణం కారణంగా ప్రమాదకరమైన రసాయనాలు నీళ్లలో కలిసిపోతాయి. వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు థాలేట్స్, బిస్ఫినాల్-ఏ లాంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఆ నీళ్లను తాగినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ సహా పలు ప్రమాదకర జబ్బుల ముప్పు కలుగుతుంది. వీలైనంత వరకు కారులో నిల్వ చేసిన నీళ్లను తాగడం మానేయాలంటున్నారు.


ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసిన నీళ్లు తాగకూడదా?

వాస్తవానికి ప్లాస్టిక్ బాటిళ్లలో ఎక్కువ కాలం నీటిని నిల్వ చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లను ప్యాక్ చేసిన తర్వాత 15 వరకు ఉపయోగించడం మంచిదంటున్నారు. అదీ గది ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేసినవి అయితేనే బెటర్. అలా కాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచిన నీటిని అస్సలు తీసుకోకూడదంటున్నారు. వేడికి నీళ్లలో అనారోగ్యకరమైన రసాయనాలు కలిసి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లను వేడి ప్రదేశాల్లో ఉంచడం వల్ల ఆ నీటిలో యాంటీమోనీ, బిస్ఫినాల్ ఏ లాంటి రసాయనాలు చేరుతాయి.  సాధారణంగా బాటిలో నిర్దిష్ట పరిమితికి మించి వేడికి గురైతే, నీళ్లలో రసాయనాల పరిమాణం పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు.  రసాయనాలు కలిసిన నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, గుండె, కిడ్నీతో పాటు క్యాన్సర్ ముప్పు ఏర్పడుతుందన్నారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో మెదడు కూడా పని చేయడం ఆగిపోతుందన్నారు.

Read Also: గుడ్డు మంచిదా, పాడైందా తెలుసుకోవాలంటే.. సింపుల్ గా ఇలా చెయ్యండి!

ప్రత్యామ్నాయ బాటిళ్లు వాడాలంటున్న నిపుణులు

వీలైనంత వరకు వేసవిలో ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని కార్లలో నిల్వ చేయకూడదంటున్నారు. ఒకేవేళ ఏసీ ఆన్ లో ఉంచితే ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం లేదంటున్నారు. అసలు ఎందుకు ఈ తలనొప్పి అనుకుంటే.. ప్లాస్టిక్ బాటిళ్లలో కాకుండా స్టీల్, కాపర్ బాటిళ్లలో నీటిని ఉపయోగించడం మంచిదంటున్నారు. ఈ బాటిళ్ల వల్ల ఎలాంటి రసాయనాలు తాగునీరులో చేరే అవకాశం లేదంటున్నారు. రిస్క్ లేకుండా ఉండాలంటే ఈ బాటిళ్లు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: వీటిని తొక్క తీయకుండానే తినాలి.. లేదంటే తిన్నా వేస్ట్!

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×