BigTV English
Advertisement

Space Stations:- స్పేస్ స్టేషన్లలో కొత్త ప్రయోగం.. ప్రొటీన్ క్రిస్టల్స్ పెంపకం..

Space Stations:- స్పేస్ స్టేషన్లలో కొత్త ప్రయోగం.. ప్రొటీన్ క్రిస్టల్స్ పెంపకం..

Space Stations:- మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు అవసరమవుతాయి. అందులో చాలావరకు కామన్‌గా కనిపించేది ప్రొటీన్. ప్రొటీన్స్, విటమిన్స్ అనేవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. అయితే ప్రొటీన్ అవసరం మనుషులకు ఎంత ఉందో తెలుసుకున్న స్పేస్ సైంటిస్టులు.. ప్రొటీన్ క్రిస్టల్స్ అనే కొత్త వస్తువును తయారు చేయడానికి పరిశోధనలు మొదలుపెట్టారు.


దాదాపు గత రెండు దశాబ్దాలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) ప్రొటీన్ క్రిస్టల్స్‌ను తయారు చేస్తూ, స్టడీ చేస్తూ బిజీగా ఉంది. మైక్రోగ్రావిటీపై పరిశోధనలు చేస్తున్న సమయంలో ప్రొటీన్ క్రిస్టల్స్ అనేవి భూమిపై కంటే స్పేస్‌లో మరింత మెరుగ్గా పెరుగుతున్నాయని గుర్తించారు. దీంతో అప్పటినుండి ఎంతోమంది శాస్త్రవేత్తలు కలిసి ఈ ప్రొటీన్ క్రిస్టల్స్‌ను స్పేస్ స్టేషన్స్‌లో పెంచడానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకు ప్రొటీన్ క్రిస్టల్స్‌పై చేసినంత పరిశోధనలు స్పేస్ స్టేషన్లలో జరగలేదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

ప్రొటీన్స్ అనేవి మనిషి పుట్టినప్పటి నుండి పెరుగుతున్న క్రమంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్‌ను మెరుగుపరచడానికి, వైరస్‌లను దూరం చేయడానికి, అనారోగ్యాల నుండి కాపాడడానికి.. ఇలా రకాలుగా ఎప్పుడూ మనిషి ఆరోగ్యానికి సాయం చేస్తూనే ఉంటాయి. మనం అనారోగ్య సమస్యల కోసం తీసుకునే మందుల్లో కూడా ఏదో ఒక రకమైన ప్రొటీన్ తప్పకుండా ఉంటుంది. శరీరంలోకి వెళ్లిన ప్రొటీన్ కరెక్ట్‌గా ఉంటే మనిషి ఆరోగ్యానికి ఏ లోటు ఉండదు.


మామూలుగా పలు అనారోగ్య సమస్యలను ట్రీట్ చేయడం కోసం అయినా రెండు రకాల ప్రొటీన్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ ప్రొటీన్స్ గురించి పూర్తిగా స్టడీ చేసి, వాటిపై అవగాహన ఉన్న శాస్త్రవేత్తలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయగలుగుతారు. అయితే ప్రొటీన్ గురించి పూర్తిస్థాయిలో స్టడీ చేయడానికి మెరుగైన పద్ధతి దానిని క్రిస్టల్స్ రూపంలో పెంచడమే అని వారికి అర్థమయ్యింది. అప్పటినుండి ఈ ప్రొటీన్ క్రిస్టల్స్‌పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

2005లో ప్రొటీన్ క్రిస్టల్స్‌పై మొదటిసారి పరిశోధనలు జరిగి సక్సెస్ అయ్యాయి. ఎక్స్‌రేలలో ఉపయోగించడం కోసం ముందుగా వాటిని ఉపయోగించారు. ఒకసారి ఈ ప్రొటీన్ క్రిస్టల్స్ సాయంతో టీబీ వ్యాధికి చికిత్సను అందింవచ్చని తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆ కోణంలో కూడా పరిశోధనలు చేశారు. ప్రపంచ దేశాలు అన్నింటిలో జపాన్ అనేది ప్రొటీన్ క్రిస్టల్స్ తయారీలో కాస్త ముందుంది. స్పేస్ స్టేషన్‌లలో ప్రొటీన్ క్రిస్టల్స్ తయారీకి సహకరించడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Realme Narzo 50: రూ.15వేల లోపే బెస్ట్ 5జీ మొబైల్.. రియల్‌మీ నార్జో 50 5జీ పూర్తి రివ్యూ

ChatGPT Wrong Answers: చాట్‌జిపిటిని నమ్మి మోసపోయాను.. ఏఐ సాయంతో పరీక్ష రాసి ఫెయిల్ అయిన సెలబ్రిటీ

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

Big Stories

×