BigTV English

April 27, Infosys: ఇన్ఫోసిస్ జాబ్‌కి రిజైన్.. జపాన్‌లో వ్యవసాయం.. డబుల్ శాలరీతో దిల్ ఖుషీ..

April 27, Infosys: ఇన్ఫోసిస్ జాబ్‌కి రిజైన్.. జపాన్‌లో వ్యవసాయం.. డబుల్ శాలరీతో దిల్ ఖుషీ..


Infosys: ఐటీ జాబ్ అంటే ఫుల్ బిందాస్. నెల నెలా లక్షల్లో జీతం. వారానికి రెండు రోజులు సెలవులు. ఏసీ ఆఫీసు. వీకెండ్ పార్టీలు. ఏటేటా హైక్. క్రెడిట్ కార్డులు. బ్యాంక్ లోన్లు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అంటే సొసైటీలో ఆ స్టేటసే వేరు. ఈజీగా పెళ్లైపోతుంది. వెంటనే ఇల్లు కొనుక్కుంటారు. లైఫ్ సెటిల్‌ అయిపోతుంది.

ఇంతేనా? ఇంకేం లేదా? చేస్తే ఐటీ జాబే చేయాలా? ప్రత్యామ్నాయం లేదా? జాబు, జీతం సరే.. మరి సంతృప్తి సంగతేంటి? ఇలా అవుటాఫ్‌ ది బాక్స్ ఆలోచించేవాళ్లు తక్కువే. కొందరికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొందరికి వ్యవసాయం మీదకు మనసు లాగేస్తుంటుంది. ఇలా కొన్ని ఆప్షన్లు ఉన్నా.. సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసే సాహసం చేసే వాళ్లు మాత్రం అతితక్కువ మందే ఉంటారు. వారిలో ఒకడు.. తమిళనాడుకు చెందిన వెంకటస్వామి విఘ్నేశ్.


ఇన్ఫోసిస్‌లో జాబ్. నెలకు 40 వేలు శాలరీ. లైఫ్ కంఫర్ట్‌గానే ఉంది. కానీ, మనసు ఇంకేదో కోరుకుంది. దిల్ మాంగే మోర్ అంటూ పదే పదే మొరాయిస్తోంది. అలా క్రష్ అవుతున్న టైమ్‌లో కరోనా కల్లోలం మొదలైంది. ఇంకేం.. మనోడు డిసైడ్ అయిపోయాడు. ఐటీ జాబ్ కంటే విలువైనవి లైఫ్‌లో ఇంకా చాలానే ఉన్నాయని ఫిక్స్ అయ్యాడు. కొన్నాళ్లకే చేస్తున్న జాబ్‌కు రిజైన్ చేశాడు. అయితే, అతనేమీ గుడ్డిగా ఉద్యోగం వదిలేయలేదు. అతని ప్లాన్స్ అతనికున్నాయి.

విఘ్నేశ్ కుటుంబానికి వ్యవసాయం ఉంది. పేరెంట్స్ ఇప్పటికీ ఫార్మింగ్ చేస్తున్నారు. కొన్నాళ్లు వారికి వ్యవసాయంలో సహాయం చేశాడు. అందులో ఏదో తెలీని సంతృప్తి దొరికింది. ఇక ఇదే తన కెరీర్ అని ఫిక్స్ అయ్యాడు. పేరెంట్స్ మాత్రం కొడుకు ప్రయత్నాన్ని అంగీకరించలేదు. వ్యవసాయం చేస్తే డబ్బు రాదన్నారు. ఎంచక్కా జాబ్ చేసుకోమంటూ సలహా ఇచ్చారు. కానీ, విఘ్నేశ్ వినలేదు.

ఓ స్నేహితుడి వల్ల జపాన్‌లోని Nihon Edutech గురించి తెలిసింది. జపానీస్ లాంగ్వేజ్ అండ్ కల్చర్‌లో ట్రైనింగ్ ఇస్తుందా సంస్థ. అర్హులకు అక్కడే జాబ్ కూడా చూపిస్తుంది. విషయం తెలిసి విఘ్నేశ్ అప్లై చేశాడు. జపాన్‌కి వెళ్లి ఆరు నెలల ట్రైనింగ్ పూర్తి చేశాడు. శిక్షణ తర్వాత.. జపాన్‌లోనే వంకాయలు పండించే ఫార్మింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఇప్పుడు అతని జీతం.. నెలకు 80 వేలు. ఇన్ఫోసిస్‌లో సంపాదించే దానికంటే డబుల్ శాలరీ వస్తోంది. పైగా ఫ్రీ అకామిడేషన్ కూడా. చేస్తున్న పనిలో ఆనందం.

అయితే, వస్తున్న జీతం చూసుకుని తాను జపాన్‌లోనే సెటిల్ అయిపోనని.. కొంతకాలం తర్వాత ఇండియాకు తిరిగొస్తానని అంటున్నాడు వెంకటస్వామి విఘ్నేశ్. జపాన్‌లో తాను నేర్చుకున్న ఇన్నోవేటివ్ ఫార్మింగ్ టెక్నిక్స్‌ను భారత్‌లోని మన రైతులకూ నేర్పిస్తానని చెబుతున్నాడు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×