Digital Arrest : డిజిటల్ అరెస్ట్.. ఈ పేరు వింటేనే ప్రతీ ఒక్కరూ హడలిపోతున్నారు. ఎందుకంటే ఇందులో స్కామర్స్ అలా నమ్మిస్తున్నారు. ఒక విశ్వసనీయ సంస్థ అధికారి అని చెబుతూ.. తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులకు కోసం హెచ్చరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరగగా.. తాజాగా జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన రిటైర్డ్ అధికారికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ డిజిటల్ అరెస్ట్ తో కేవలం 11 రోజుల్లో రూ. 2.27 కోట్లు కోల్పోయాడీ వ్యక్తి.
కోల్ ఇండియాలో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారిని సైబర్ నేరగాళ్లు తమ వలలో వేసుకున్నారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులుగా చెబుతూ మోసం చేశారు. 2024 డిసెంబర్ 10న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారి అభిరాజ్ శుక్లాగా తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి.. స్కామ్ కు తెరతీశాడు.మోసపూరిత కార్యకలాపాలకు తన మొబైల్ నంబర్‌ను ఉపయోగించి తప్పుదారి పట్టించే ప్రకటనలను వ్యాప్తి చేస్తున్నాడని కాల్ చేసిన వ్యక్తి ఆరోపిస్తూ బాధితుడిని భయాందోళనకు గురిచేశాడు. ఈ విషయాలను ఆ బాధితుడు నమ్మనప్పటికీ.. అతని వ్యక్తిగత పత్రాలు దుర్వినియోగానికి గురయ్యాయని.. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తానని బెదిరించాడు.
అంతేకాకుండా బాధితుడ్నిపూనమ్ గుప్తా అనే మహిళ సంప్రదించింది. తాను ఢిల్లీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారిగా పరిచయం చేసుకుంది. తనని గుర్తించటానికి మొబైల్ కెమెరాను ను ఆన్ చేయమని.. వీడియో కాల్ లో తను ఎవరో క్లియర్ గా కనిపిస్తుందని నమ్మించింది. అంతే కాకుండా ఆ వ్యక్తిని బెదిరిస్తూ.. 11 రోజులలో సీనియర్ IPS అధికారిగా నటిస్తున్న మరో వ్యక్తి కూడా వీడియో కాల్ లో కనిపిస్తూ బెదిరించారు.
ALSO READ : భారత్ పై జుకర్ బర్గ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ‘మెటా’
ఇలా బెదిరిస్తూ అతని నుంచి దాదాపు రూ.2.27 కోట్లు కొట్టేశారు. ఎనిమిది బ్యాంకుల్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేయడమే కాకుండా అతని భార్యకు సంబంధించిన రెండు ఖాతాల నుంచి కూడా డబ్బులు కొల్లగొట్టేశారు. ఎన్నో ఏళ్లపాటు ఆ వ్యక్తి చేసుకున్న సేవింగ్స్ అన్ని దోచేశారు. ఈ డబ్బులు ఆయన ఖాతా నుంచి ట్రాన్ఫర్ చేసుకున్న తర్వాత స్కామర్స్ ఈ నెంబర్స్ ను బ్లాక్ చేశారు. దీనితో తాను మోసపోయారని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ విషయంపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు ప్రతి చోట జరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ప్రజలు మోసపోతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను నమ్మొద్దని చెప్పుకు వచ్చారు. కాల్ చేస్తున్న వ్యక్తిని కచ్చితంగా ధృవీకరించాలని.. ముఖ్యంగా ఏ ప్రభుత్వ అధికారి వీడియో కాల్ ద్వారా సంప్రదించరు అనే విషయాన్ని గుర్తించాలని చెప్పుకొచ్చారు.
అధికారిక నంబర్లను ఉపయోగించి తిరిగి కాల్ చేయాలి తప్పా కాలర్స్ ఉపయోగించిన నెంబర్ల నుంచి కాల్ చేయొద్దని తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తుల నుంచి ఎట్టి పరిస్థితిలోనూ ఎలాంటి సమాచారం పంచుకోవద్దని ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారా బ్యాంకు వివరాలు లేదా పత్రాలు ఇవ్వొద్దని తెలిపారు. ఇలాంటి బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. స్కామర్స్ నమ్మించే విధంగా ప్రవర్తిస్తారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి వివరాలు తెలపొద్దని చెప్పుకువచ్చారు.