Realme 14 Pro Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ.. Realme GT 7 ప్రో తర్వాత Realme 14 ప్రో సిరీస్‌ను ఇండియాలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Realme 14 ప్రో సిరీస్ లాంఛ్ ఈవెంట్ ఇండియాలో రేపు గ్రాండ్ గా జరగనుంది. ఈ లైనప్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి. అవి Realme 14 Pro, Realme 14 Pro+. ఇక లాంఛ్ కు ముందే ఈ రెండు మొబైల్ ఫీచర్స్ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఎప్పటికప్పుడు తన కస్టమర్ కోసం లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ realme. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా డిసెంబర్లో రియల్ మీ 14X సిరీస్ ను లాంఛ్ చేసిన ఈ సంస్థ.. ఇందులో భాగంగా లేటెస్ట్ ఫీచర్స్ తో రెండు మొబైల్స్ ను తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు Realme 14 ప్రో సిరీస్ లో మరో రెండు మొబైల్స్ ను తీసుకొచ్చినందుకు సన్నాహాలు చేస్తుంది. రియల్ మీ 14 ప్రోలో భాగంగా అదిరిపోయే ఫీచర్స్ తో మొబైల్స్ ను లాంచ్ చేయనుంది.
ALSO READ : వామ్మో! ఎంతకు తెగించారు.. రూ.2.27 కోట్లు కళ్లముందే కొట్టేశారు!
నచ్చిన విధంగా కలర్స్ మార్చే బ్యాక్ ప్యానెల్ ఈ మెుబైల్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనుంది. పెరల్ వైట్ వేరియంట్ చల్లని వాతావరణంలో రంగు మారే విధంగా రాబోతుంది. 16° c కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ ప్యానల్ నీలం రంగులోకి మారుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ మొబైల్ జైపూర్ పింక్, బికనీర్ పర్పుల్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది. దానికి అదనంగా రెండు మోడల్‌లు స్లిమ్ 7.5mm ప్రొఫైల్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రాబోతున్నాయి.
అంతేకాకుండా, ప్లస్ వేరియంట్ 1.5K రిజల్యూషన్, స్లిమ్ బెజెల్స్‌తో క్వాడ్ కర్వ్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. పనితీరు విషయంలో, Realme 14 Pro సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు రెండూ Snapdragon 7s Gen 3 చిప్‌సెట్‌లో పని చేయగలవు. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉండనుంది. చివరగా, ఇది 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేయగలదు. ఈ సిరీస్ లో రియల్ మీ “టైటాన్ బ్యాటరీ”ను పరిచయం చేస్తుంది.
Realme 14 Pro సిరీస్ ధర విషయానికి వస్తే… Realme 14 Pro రూ. 26,999, Realme 14 Pro+ ధర రూ. 32,999గా ఉండనున్నట్టు సమాచారం. ఇక రేపు లాంచ్ కాబోతున్న ఈ రెండు మొబైల్స్ అసలు ధరలు త్వరలోనే తెలియాల్సి ఉంది. అయితే మొబైల్ ఫస్ట్ సేల్ ఎప్పటినుంచి ప్రారంభం కానుంది అనే విషయంపై క్లారిటీ లేదు. అయినప్పటికీ రియల్ మీ అఫీషియల్ వెబ్సైట్స్ తో పాటు ప్రముఖ ఈ కామర్ సంస్థల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అంతేకాకుండా మొబైల్ పై స్పెషల్ డిస్కౌంట్ సైతం రియల్ మీ అందించే ఛాన్స్ ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ ధరలోనే బెస్ట్ మొబైల్ కొనాలనుకునే యూజర్స్ కచ్చితంగా ఈ మొబైల్ ను ట్రై చేసేయండి.