BigTV English

Realme Buds T200: రియల్‌ మి న్యూ ఇయర్‌బడ్స్.. జూలై 24న లాంచ్, స్పెషలేంటి?

Realme Buds T200: రియల్‌ మి న్యూ ఇయర్‌బడ్స్.. జూలై 24న లాంచ్, స్పెషలేంటి?

Realme Buds T200: టెక్ ప్రియులకు మరొక శుభవార్త. ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్‌తో ఇయర్ బడ్స్ విపరీతంగా వినియోగిస్తున్నారు. మార్కెట్లోకి ఏ కంపెనీ కొత్తవి తెచ్చినా హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. తాజాగా రియల్‌మి కొత్త ఇయర్‌బడ్‌లు జూలై 24న లాంచ్ కానుంది. ఇందులో స్పెషల్ ఏంటని ఆలోచన చేస్తున్నారా? బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల వరకు ఉంటుంది.


రియల్‌మి బడ్స్ T200 TWS ఇయర్ ‌ఫోన్‌లు జూలై 24న ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ బడ్‌లు రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌ మి 15 5G స్మార్ట్‌ఫోన్‌లతో లాంచ్ కానున్నాయి. 12.4mm డైనమిక్ డ్రైవర్లు, 32dB ANC, 50 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు రానున్నాయి. డ్రీమీ పర్పుల్, నియాన్ గ్రీన్, మిస్టిక్ గ్రే, స్నోవీ వైట్ అనే నాలుగు రంగులతో రాబోతున్నాయి.

జూలై 24న సాయంత్రం 7 గంటలకు ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్నాయి. వీటిని Realme, Flipkart వెబ్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బడ్స్ T200 ఇయర్ ‌ఫోన్‌ల కొన్ని స్పెసిఫికేషన్‌లు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రస్తావించారు.


20Hz–40,000Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్‌తో 12.4mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. ఇయర్‌ ఫోన్‌లు క్వాడ్ మైక్ సిస్టమ్-ANC ఫంక్షనాలిటీని కలిగి ఉన్నాయి. ఇది 32dB వరకు అవాంఛిత శబ్దాన్ని రద్దు చేస్తుందని పేర్కొంది.

ALSO READ: ప్రీమియం ఫ్లిప్ ఫోన్ పై 50 వేల వరకు తగ్గింపు, ఉచితంగా ఇయర్ బడ్స్ కూడా

గేమింగ్ కోసం Realme Buds T200.. 45ms తక్కువ-లేటెన్సీ గేమ్ మోడ్‌ను అందించనున్నాయి. వాటికి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఉంది. ఇది LDAC కోడెక్‌కు మద్దతు ఇస్తుంది. IP55 రేటింగ్ ఉంది. దుమ్ము, నీటి నిరోధకతను అందిస్తుంది. రియల్‌మి బడ్స్ T200 హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్, 3D స్పేషియల్ ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, ఇన్-ఇయర్ డిజైన్‌తో వస్తాయి.

రియల్‌మి బడ్స్ T200 బ్యాటరీ లైఫ్ 50 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. ANC ఆన్‌లో ఉన్నప్పుడు 35 గంటల వరకు ఉంటుంది. ఇయర్‌ఫోన్‌లు 10 నిమిషాల క్విక్ ఛార్జ్‌తో 5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలవు. Realme 15 5G, Realme 15 Pro 5G లతో పాటు బడ్స్ T200 ఇయర్‌ఫోన్‌లు లాంచ్ అవుతాయి. Realme 15 5Gలో మీడియా టెక్ Dimensity 7300 plus ప్రాసెసర్ ఉండనుంది. Pro వెర్షన్‌లో Snapdragon 7 Gen 4 చిప్‌సెట్ ఉంటుంది.

Related News

7000mAh Budget Phones: రూ 20000 లోపు ధరలో 7000mAh బ్యాటరీ ఫోన్లు.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఇవే..

Galaxy S25 FE vs iPhone 16e: రెండు బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మధ్య గట్టి పోటీ.. విన్నర్ ఎవరు?

Moto Book 60 Pro: మోటోరోలా కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌తో లాంచ్

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫై భారీ తగ్గింపు.. ఏకంగా ₹45,000 డిస్కౌంట్

WhatsApp Tricks: వాట్సప్‌లో కొత్త ఫీచర్స్.. తెలుసుకోకపోతే చాలా మిస్సవుతారు !

Huawei Mate XTs: 10.2 అంగుళాల భారీ స్క్రీన్‌.. అద్భుత కెమెరాలతో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్

Big Stories

×