రివ్యూ : సైయారా హిందీ మూవీ
నటీనటులు: అహాన్ పాండే, అనీత్ పడ్డా, వరుణ్ బడోలా, షాన్ ఆర్ గ్రోవర్ తదితరులు
దర్శకుడు: మోహిత్ సూరి
నిర్మాణ సంస్థ: యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF)
సంగీతం: తనీష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా, అర్సలాన్ నిజామీ, మిథూన్, సచేత్
లిరిక్స్: ఇర్షాద్ కమిల్, మిథూన్
Saiyaara Review : బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమైన బాలీవుడ్ మూవీ ‘సైయారా’. రోమ్ కామ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ‘ఆషికి 2’ ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, ‘సలాం వెంకీ’ ఫేమ్ అనీత్ పడ్డా హిరోహిరోయిన్లుగా నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పాటలు దుమ్మురేపుతున్నాయి. దీంతో భారీ అంచనాలతో ఈ మూవీ జూలై 18వ తేదీన గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ మూవీ అంచనాలను అందుకుందా ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే…
మ్యూజిక్ అంటే మంచి ఫ్యాషన్ ఉన్న యంగ్ సింగర్ క్రిష్ కపూర్. పాపులర్ సింగర్ కావాలని కలలు కంటాడు. మరోవైపు సూపర్ టాలెంట్ ఉన్న పాటల రచయిత్రి వాణి బాత్రా (అనీత్ పడ్డా). ఇద్దరిదీ ఒకే మ్యూజిక్ ప్రొఫెషనే కావడంతో ఒకానొక టైంలో కలుస్తారు. ఇద్దరూ కలిసి పని చేయాల్సి వస్తుంది. అలంటి టైంలోనే ఇద్దరూ ఒకరికొకరు అంతగా సంతోషంగా లేని తమ గతం గురించి తెలుసుకుంటారు ఇక ఇప్పటికైనా ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, మంచి స్థాయికి వెళ్లాలని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. చివరికి ప్రేమలో పడతారు. కానీ వాణి సడన్ గా చనిపోవడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ వాణి ఎలా చనిపోయింది? ఆ తరువాత క్రిష్ ఏం చేశాడు? వీరిద్దరి గతం ఏంటి? అనేది స్టోరీ.
విశ్లేషణ
మోహిత్ నుంచి సినిమా అంటే ఖచ్చితంగా రోమ్ కామ్ సినిమాలను ఇష్టపడే వారి అంచనాలు గట్టిగానే ఉంటాయి. మ్యూజికల టచ్ తో లవ్, అందులోని పెయిన్ ను ఆయన స్క్రీన్ పై అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. గతంలో తాను చేసిన ఆషికీ 2, మలంగ్ స్టైల్ లో ఈ సినిమాలో కూడా ప్రేమ ప్లస్ మ్యూజిక్ ను పర్ఫెక్ట్‌గా వడ్డించాడు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, ఎమోషనల్ టచ్ బాగున్నాయి. ముఖ్యంగా కాన్సర్ట్ సీన్స్, బైక్ రైడ్స్, బీచ్ సీక్వెన్స్‌లు విజువల్‌గా స్టన్నింగ్. యాక్షన్ సీన్స్ కూడా బాగా కొరియోగ్రాఫ్ చేశారు.
కానీ మొదటి సగం సాగదీశారు. ఫస్ట్ హాఫ్ లో కాస్త ఓపిక పట్టాల్సిందే. అలాగే ప్రిడిక్టబుల్ ప్లాట్ నిరాశ పరుస్తుంది: కథలో ఆషికీ 2, మలంగ్, యు మీ ఔర్ హమ్ వైబ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే కొత్తదనం కొరవడింది. అది ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ తప్పదు. సైయారా మ్యూజిక్ అల్బమ్ జెన్-Z ఫేవరెట్ లిస్ట్ లో ఆల్రెడీ చేరిపోయింది. టైటిల్ ట్రాక్ (తనీష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా, అర్సలాన్ నిజామీ), హమ్‌సఫర్ (సచేత్-పరంపర) చార్ట్‌బస్టర్స్. శ్రేయ ఘోషల్ రీప్రైజ్ వెర్షన్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. మిథూన్ కంపోజ్ చేసిన ధున్ (అరిజిత్ సింగ్) కొంతమందికి నిరాశపరిచినా, ఓవరాల్ ఆల్బమ్ అదుర్స్.
నటీనటుల విషయానికొస్తే… అహాన్ పాండే క్రిష్‌గా స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టాడు. రెబల్ మ్యుజిషియన్ పాత్రలో రణబీర్ కపూర్ వైబ్ కనిపిస్తుంది. అనీత్ పడ్డా వాణిగా సాఫ్ట్ బట్ పవర్‌ఫుల్. ఆమె ఎమోషనల్ సీన్స్‌లో, ముఖ్యంగా హార్ట్‌బ్రేక్ మూమెంట్స్‌లో ఏడిపించేసింది. కొత్త నటులే అయినా ఇద్దరి కెమిస్ట్రీ విజువల్ ట్రీట్. ఇద్దరికీ ఇది స్టన్నింగ్ డెబ్యూ: అయితే వరుణ్ బడోలా, షాన్ ఆర్ గ్రోవర్ వంటి సపోర్టింగ్ కాస్ట్ హైలైట్ అయినా, వారికి స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండడం మరో మైనస్.
ప్లస్ పాయింట్స్
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
సోల్ ఫుల్ మ్యూజిక్
మోహిత్ సూరి మ్యాజిక్
మైనస్ పాయింట్స్
స్లో ఫస్ట్ హాఫ్
ప్రిడిక్టబుల్ ప్లాట్
సపోర్టింగ్ యాక్టర్స్ స్క్రీన్ స్పేస్
మొత్తానికి
జెన్ జెడ్ టచ్ తో మోహిత్ సూరీ సిగ్నేచర్ ఫిలిం. రొమాంటిక్ సినిమా ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్, మోహిత్ సూరి ఫాలోవర్స్‌కి పక్కా థియేటర్ రైడ్. అంచనాలు లేకుండా ఓసారి చూడొచ్చు.
Saiyaara Movie Rating : 1.75/5