Moto Razr 50 Ultra| ఒక స్టైలిష్ ఫ్లిప్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం! గత సంవత్సరం విడుదలైన మోటో రేజర్ 50 అల్ట్రా, మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న పవర్‌ఫుల్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. అందమైన, ఆధునిక డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్‌లున్నాయి. దీంతో ఈ ఫోన్ పర్‌ఫామెన్స్ కూడా సూపర్. అంతేకాదు, ఈ ఫోన్‌లో ఇన్ బిల్ట్ AI ఉండటం వల్ల మీ ఫోన్ యూసేజ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మెరుగవుతుంది.
అమెజాన్ ఇండియాలో భారీ తగ్గింపు
ప్రస్తుతం అమెజాన్ ఇండియా మోటో రేజర్ 50 అల్ట్రాపై 41% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,19,000 కాగా, ఇప్పుడు కేవలం రూ.69,990కే సొంతం చేసుకోవచ్చు! అంటే, దాదాపు రూ.49,000 తగ్గింపు!
కేవలం తగ్గింపుతోనే ఆగలేదు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి రూ.5,999 విలువైన మోటో బడ్స్+ ఉచితంగా లభిస్తాయి. అంతేకాదు, మీరు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే, రూ.2,099 వరకు అమెజాన్ పే బ్యాలెన్స్‌గా తిరిగి పొందవచ్చు. ఈ ఆఫర్ మిడ్‌నైట్ బ్లూ రంగు ఫోన్‌కు మాత్రమే వర్తిస్తుంది.
మోటో రేజర్ 50 అల్ట్రాలో ఈ ఫీచర్లు హైలైట్
మోటో రేజర్ 50 అల్ట్రా 6.9 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో అత్యంత స్మూత్‌గా ఉంటుంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ మాక్సిమమ్ బ్రైట్ నెస్, బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫ్లిప్ ఫోన్ లో 4 అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే ఉంది. ఇది నోటిఫికేషన్‌లను చూడటానికి లేదా ఫోన్‌ను తెరవకుండానే చిన్న పనులు చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 735 GPU ఉన్నాయి. ఇవి గ్రాఫిక్స్, పర్‌ఫామెన్స్‌లో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. భవిష్యత్తులో 3 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు ఉంటాయని కంపెనీ హామీ ఇచ్చింది.
అద్భుతమైన కెమెరా, బ్యాటరీ
కెమెరా విషయానికొస్తే.. మోటో రేజర్ 50 అల్ట్రా వెనుకవైపు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉంది. అలాగే, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇవి వీడియో కాల్స్, సెల్ఫీలకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఈ ఫోన్‌లో 4000mAh బ్యాటరీ ఉంది, ఇది 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. ఎప్పుడూ ఉపయోగానికి సిద్ధంగా ఉంటుంది.
Also Read: రూ. 10,000 లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. తక్కువ బడ్జెట్‌లోనే పవర్‌ఫుల్ బ్యాటరీ, కెమెరా ఇంకా..
ఈ ఆఫర్ ఒక ప్రీమియం ఫ్లిప్ ఫోన్‌ను చవకగా పొందే అద్భుతమైన అవకాశం. ఉచిత మోటో బడ్స్+ క్యాష్‌బ్యాక్‌తో, ఈ డీల్ టెక్ ప్రియులు, ట్రెండ్‌సెట్టర్లకు సరైన ఆప్షన్. భారీ డిస్కౌంట్ తో ఈ ప్రీమియం ఫ్లిప్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి అవకాశం. మీ స్టైలిష్ మోటో రేజర్ 50 అల్ట్రాను ఇప్పుడే కొనుగోలు చేయండి!