Realme Narzo 80 Lite| బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు ఫేమస్ అయిన రియల్‌మీ కంపెనీ భారతదేశంలో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ అయిన.. రియల్ మీ నార్జో 80 లైట్ 5జీ (Realme Narzo 80 Lite 5G)ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అధిక సామర్థ్యం గల ఫీచర్లను తక్కువ ధరలో అందిస్తూ.. బడ్జెట్‌కు తగిన ఫోన్ కోరుకునే వారికి అద్భుతమైన ఎంపికగా మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చింది. 6000mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ శక్తివంతమైన పనితీరును అందిస్తుంది.
Realme Narzo 80 Lite 5G: ధర, డిస్కౌంట్ వివరాలు
Realme Narzo 80 Lite 5G రెండు వేరియంట్‌లలో లభిస్తుంది.
4GB RAM + 128GB స్టోరేజ్: రూ. 10,499 (రూ. 500 డిస్కౌంట్ తర్వాత రూ. 9,999)
6GB RAM + 128GB స్టోరేజ్: రూ. 11,499 (రూ. 700 డిస్కౌంట్ తర్వాత రూ. 10,799)
ఈ స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ పర్పుల్, ఒనిక్స్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయ రంగులలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ జూన్ 23 నుంచి ఉదయం రాత్రి 12 గంటలకు అమెజాన్‌లో సేల్స్ ప్రారంభం కానున్నాయి.
ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
Realme Narzo 80 Lite 5G శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Android 15 ఆధారంగా Realme UI 6.0తో వస్తుంది. ఈ ఫోన్ AI-ఆధారిత ఫీచర్లతో మంచి స్మూత్ అండ్ స్మార్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల LCD పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రంగులతో కూడిన చిత్రాలను సున్నితమైన టచ్ అనుభవాన్ని అందిస్తుంది.
భారీ బ్యాటరీ, కెమెరా సెటప్
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని అతి పెద్ద అట్రాక్షన్ దీని బ్యాటరీ. ఇందులో 6000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ యూఎస్‌బి టైప్ సి (USB Type-C) ద్వారా 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో 15W ఛార్జర్ కూడా ఉంటుంది. ఈ భారీ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఉపయోగించవచ్చు.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 32MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు సాధారణ ఉపయోగానికి మంచి క్వాలీటీ గల ఫొటోలను అందిస్తాయి. అంతేకాక, ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ కల్పిస్తుంది. పైగా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ (Rainwater Smart Touch) ఫీచర్ ద్వారా తడి పరిస్థితుల్లో కూడా ఫోన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.
ఎందుకు ఎంచుకోవాలి?
Realme Narzo 80 Lite 5G భారతదేశంలో రూ. 10,000 లోపు సెగ్మెంట్‌లో ఒక పవర్ ఫుల్ ఆప్షన్ గా నిలుస్తుంది. దీని భారీ బ్యాటరీ, 5G సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు బడ్జెట్ ఫోన్ కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. Narzo 80 Pro, Narzo 80x తర్వాత విడుదలైన ఈ ఫోన్, కొత్త డిజైన్ అప్‌గ్రేడ్‌లతో మరింత విలువను అందిస్తోంది.
Also Read: ఫోన్‌లో డేటా దొంగిలిస్తున్న ఏఐ.. ప్రమాదంలో యూజర్ ప్రైవసీ
మీరు తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Realme Narzo 80 Lite 5G ఒక గొప్ప ఎంపిక. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, సరసమైన ధర దీనిని యువత బడ్జెట్‌కు తగిన ఫోన్ కోరుకునే వారికి ఆకర్షణీయంగా చేస్తుంది.