Train: తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు చిగిచెర్ల వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉన్నట్లుండి మంటలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. ఈ ఘటన నేపథ్యంలో అరగంటపాటు రైలు నిలిచిపోయింది. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వస్తోంది సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలు. సోమవారం రాత్రి 8. 55కి తిరుపతి నుంచి ఆ రైలు బయలు దేరింది. ఆ రైలు అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో చిగిచెర్ల వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది.
రైల్లో మంటలు రావడం చూసి ప్రయాణికులు భయపడ్డారు. పొగలు రావడం గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. దీంతో గందరగోళం చెలరేగింది. పరిస్థితి గమనించిన రైలు గార్డు, ప్రయాణికుల అరుపులు విని వెంటనే అక్కడికి చేరుకున్నాడు. వెంటనే లోకో పైలట్‌కు సమాచారం అందించాడు.
లోకో పైలట్, గార్డు, సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో తీసుకున్న చర్యలతో పెను ప్రమాదం తప్పింది. మంటలను గమనించిన ప్రయాణికులు కొందరు అప్పుడు రైలు దిగేశారు. ఈ ఘటన వల్ల చిగిచెర్ల వద్ద దాదాపు అరగంటపాటు రైలు నిలిచి పోయింది. ఆ రూట్లో వెళ్లే రైళ్లు కాస్త డిలే అవుతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: రెడీ అయ్యింది భారీ వంతెన.. ఇక బుల్లెట్ ట్రైన్ పరుగుకు రెడీ
రంగంలోకి దిగిన సాంకేతిక సిబ్బంది తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. అర గంట తర్వాత రైలు చెగిచెర్ల నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరింది. ఈ ఘటనలో ప్రయాణికులు సేఫ్‌గా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విచారణ ప్రారంభించింది రైల్వే విభాగం. బోగీ చక్రాల వద్ద బ్రేక్ బైండింగ్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా తేలింది.
ఇటీవల అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత ప్రయాణికుల్లో భయం నెలకొంది. ఆ ఘటన తర్వాత ప్రమాదాలు ఇలా ఉంటాయా అంటూ దేశవ్యాప్తంగా చర్చించుకున్నారు. ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో తెలియక కొందరిలో టెన్షన్ కనిపిస్తోంది. ట్రావెల్ చేస్తున్నా ఓవైపు భయం వెంటాడుతోంది.