HBD JD Chakravarthy: ప్రముఖ నటుడు జేడీ.చక్రవర్తి (JD Chakravarthy) తొలిసారి రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)దర్శకత్వం వహించిన ‘శివ’ సినిమా ద్వారా విలన్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టారు.మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న ఈయన ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించి, తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు. తమిళ్ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. వేలకోట్ల ఆస్తికి అధిపతి అని, కానీ రాయల్ లైఫ్ అనుభవించే ఈయన సడన్గా రోడ్డున పడ్డారు అని, అదే సమయంలో తన తల్లి భార్యగా నిరూపించుకోవడానికి దాదాపు రెండు సంవత్సరాలు పాటు కష్టపడిందని ,గతంలో జేడీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ నాటి జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
నాన్న చనిపోయాక మా జీవితం కన్ఫ్యూజన్లో పడింది – జెడి చక్రవర్తి
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. జేడీ చక్రవర్తి ఒకప్పుడు స్టార్ హీరోలకు దీటుగా సినిమాలు చేసి మెప్పించారు. హీరోగానే కాదు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి కూడా మెప్పించారు. పాత్ర కంటే కంటెంట్ కే ప్రయారిటీ ఇచ్చే ఈయన.. తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తర్వాత ఇండస్ట్రీకి చాలా ఏళ్లు గ్యాప్ ఇచ్చిన జేడీ.చక్రవర్తి ‘దయా’ అనే వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు తన రాయల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలు ఎదురయ్యాయి. దానిపై ఆయన మాట్లాడుతూ.. “నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. రాత్రి నాతో పడుకున్న నాన్న తెల్లారేసరికి లేవకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఆ వయసులో ఈ బరువు, బాధ్యతలు పెద్దగా తెలియదు. దాంతో పెద్ద కన్ఫ్యూజన్లో పడ్డాను”.
భార్యగా నిరూపించుకోవడానికి అమ్మ రెండేళ్లు కష్టపడింది..
ముఖ్యంగా..” మా అమ్మ.. నాన్న చనిపోయేసరికి చాలా బాధగా ఫీల్ అయింది. మా అమ్మ పేరు కోవెల శాంతి (Kovela Shanti) ఆమె ఇండియాలోనే అత్యధికంగా చదువుకున్న ఉమెన్. ఎంఏ లు, ఎన్నో డాక్టరేట్ లు, పీహెచ్డీలు, మ్యూజిక్ లో ప్రొఫెసర్ కూడా.. ఇక కాలేజ్లో మ్యూజిక్ ప్రొఫెసర్ గా సరదాగా జాబ్ చేస్తూ ఉండేది. ఇక నాన్న చనిపోయినప్పుడు భర్త ఆస్తి భార్యకు రావాలి అంటే లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ కావాలట. ఆ సమయంలో మా అమ్మ ఆయనకు ఫస్ట్ వైఫ్, లాస్ట్ వైఫ్ అని ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తే తప్ప నాన్నగారి ప్రాపర్టీలు మాకు రావు. అలా ఒక భార్యగా నిరూపించుకోవడానికి అమ్మ దాదాపు రెండేళ్లు కష్టపడింది. అప్పట్లో ఒక ఎకరం స్థలంలో ఉండే మేము.. నాన్న చనిపోయిన తర్వాత మధ్య ఇంట్లోకి వెళ్లిపోయాము. నాన్న బ్రతికున్నప్పుడు లగ్జరీ హోమ్, రాయల్ లైఫ్ ఉండేది. ఆయన చనిపోయాక అన్నీ పోయాయి. ఇక అద్దె ఇంట్లో ఉంటూ అన్ని పనులు మేమే చేసుకోవాల్సి వచ్చింది. నాన్న ఉన్నప్పుడు కార్లలో తిరిగిన మేము.. ఆయన వెళ్లిపోయాక రోడ్లపై నడుచుకుంటూ వెళ్ళాము. ఒకరకంగా రాయల్ లైఫ్ నుంచి రోడ్డున పడ్డాము. ఇక ఆ రెండేళ్ల తర్వాత మళ్లీ మా ఆస్తులు మాకు వచ్చాయి” అంటూ జేడీ చక్రవర్తి తెలిపారు. జె.డి చక్రవర్తి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Pawan Kalyan: అందులోనూ రికార్డు సాధించిన హరిహర వీరమల్లు.. ఇలా కూడానా..?