AP DSC Notification: DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్. మెగా DSC నోటిఫికేషన్‌ను మరో ఐదు రోజుల్లో ఇవ్వబోతున్నామని చెప్పారు.. మంత్రి నారా లోకేశ్. 16 వేలకు పైగా పోస్టులతో DSC నోటిఫికేషన్ రానుంది. SC కమిషన్ రిపోర్ట్‌కు కేబినెట్ నిన్ననే ఆమోదం తెలిపిందని, మరో రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి.. DSC నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. లోకేశ్. SC వర్గీకరణ ప్రక్రియ ఆలస్యమవడం వల్లే DSC నోటిఫికేషన్ విడుదల కూడా ఆలస్యమైందని చెప్పారు.
కాగా.. ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించి సన్మానించారు. షైనింగ్ స్టార్స్-2025 పేరుతో .
ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించి ల్యాప్‌ట్యాప్‌లను బహూకరించారు. మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారని, ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విజేతలకు హ్యాట్సాఫ్ చెప్పారు.
టాపర్స్ మధ్య కూర్చోవడం తన అదృష్టమన్నారు లోకేష్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. టెక్స్ట్‌బుక్స్, నోట్ పుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించామన్నారు.. ప్రిన్సిపల్స్ కు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇలా అనేకం చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. విద్యాశాఖలో జూన్ నాటికి సంస్కరణలు పూర్తిచేసి అనంతరం లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృషి పెడతామన్నారు లోకేష్. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. స్కూళ్లు రీఓపెన్‌లోగా నియామకాలు పూర్తి కావాలని అధికారులకు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో డీఎస్సీ భర్తీ చేస్తామన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి విడుదల చేయనున్న మెగా డీఎస్సీ నోటికేషన్‌లో.. ఎస్‌జీటీ 6,371 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్స్ 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్స్ పోస్టులు 52 ఉండనున్నాయి.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మన స్వర్ణాంధ్రలో 99 పైసలకే 21 ఎకరాలు భూమి.. ఎక్కడో తెల్సా..?
ఇటీవల సీఎం చంద్రబాబు ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపిన సంగతి తెలిసిందే.. ఎస్సీ వర్గీకరణతో డీఎస్సీ భర్తీ చేస్తామన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్లు పరీక్షను పర్ఫెక్టుగా నిర్వహించాలని సూచించారు. రెండ్రోజులపాటు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. దాంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై కీలక సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి.. మెగా డీఎస్సీ ఫైల్ పై సైన్ చేశారు సీఎం చంద్రబాబు.