Internet outage: ఎర్ర సముద్రంలో కేబుల్ దెబ్బతినడం వల్ల భారత్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ నివేదించింది. దీనికారణంగా భారత్, పాకిస్తాన్ సహా పశ్చిమ ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది.
ఎర్ర సముద్రంలో సబ్‌సీ కేబుల్ వ్యవస్థలు దెబ్బ తినడంతో భారత్, పాకిస్తాన్, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ అబ్జర్వేటరీ నెట్‌బ్లాక్స్ తెలిపింది. కేబుల్ కట్ కావడంతో కచ్చితమైన కారణం తెలియలేదు. హౌతీ తిరుగుబాటుదారులు ఈ కేబుల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్నాళ్లుగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దేశం దేనికి లొంగకపోవడంతో కేబుల్ కట్ చేసినట్టు చెబుతున్నారు. దీనివెనుక హౌతీలు ఉండవచ్చని అంటున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఎస్‌ఎండబ్ల్యూ4, ఐఎంఈడబ్ల్యూ కేబుల్ సిస్టమ్‌లలో సమస్యలు తలెత్తినట్టు నెట్‌బ్లాక్స్ పేర్కొంది.
ఎస్‌ఎండబ్ల్యూ4 కేబుల్ అనేది భారత్‌కి చెందిన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తుంది. ఐఎంఈడబ్ల్యూ కేబుల్‌ను ఆల్కాటెల్-లూసెంట్ నేతృత్వంలో ఓ కన్సార్టియం చేపట్టింది. అయితే ఆ రెండు సంస్థలు ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారికంగా రియాక్ట్ కాలేదు. ఎర్ర సముద్ర ప్రాంతం సముద్ర అంతర్భాగ ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది.
ALSO READ: భారత్‌లో ఆపిల్ సంచలనం.. లాంచ్ ముందే 75వేల కోట్ల అమ్మకాలు
ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ తన స్టేటస్ వెబ్‌సైట్‌లో పశ్చిమ ఆసియాలో ఇంటర్నెట్ వేగం తగ్గవచ్చని తెలిపింది. ఎర్ర సముద్రంలోని కేబుల్ కట్ వల్ల ఈ సమస్య తలెత్తినప్పటికీ, ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. నెట్‌వర్క్‌లో అంతరాయాలు ఖండాలు అంతటా వ్యాపించవచ్చని అంటున్నారు.
వ్యాపారాలు, క్లౌడ్ సేవలు, వ్యక్తిగత వినియోగదారులను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదవ శాత్తూ దెబ్బ తిన్నాయా? ఓడలకు వేసే యాంకర్ల వల్ల డ్యామేజ్ అయ్యిందా? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కేబుల్ పై దాడులు చేశారా? అనేది తెలియాల్సివుంది. మరమ్మతులకు వారాల సమయం పట్టవచ్చని అంటున్నారు.
కేబుల్స్ రికవరీ చేయాలంటే ప్రత్యేక నౌకలు, సిబ్బంది అవసరం కూడా. మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-UAE అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. యూఏఈ యాజమాన్యంలోని డూ, ఎటిసలాట్ నెట్‌వర్క్‌లలో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉందని ఫిర్యాదు చేసింది.
ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరిగింది. అందులో పలువురు కీలక నేతలు మరణించారు. గతేడాది ప్రారంభంలో యెమెన్‌లోని ప్రవాస ప్రభుత్వం హౌతీలు అండర్ సీ కేబుల్‌లపై దాడి చేయాలని ప్లాన్ వేస్తున్నట్లు ఆరోపించింది. ఆదివారం హౌతీల అల్-మసీరా న్యూస్ ఛానల్ కేబుల్ కట్‌లను గుర్తించింది కూడా.
⚠️ Confirmed: A series of subsea cable outages in the Red Sea has degraded internet connectivity in multiple countries including #Pakistan and #India; the incident is attributed to failures affecting the SMW4 and IMEWE cable systems near Jeddah, Saudi Arabia 📉 pic.twitter.com/cLsO3cxKbI
— NetBlocks (@netblocks) September 6, 2025